logo

కాంగ్రెస్ ఎమ్మెల్యేను కలిసిన గాలి జనార్దన్ రెడ్డి

కాంగ్రెస్ ఎమ్మెల్యేను కలిసిన గాలి జనార్దన్ రెడ్డి

ఇటీవల రిసార్టులో బళ్ళారికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఈ గొడవలో గాయపడిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్‌ బెంగళూరు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో మాజీ సీఎం సిద్ధరామయ్య, మంత్రి డి.కే శివకుమార్‌ మధ్య కోల్డ్‌వార్‌ మొదలైందని.. ఎమ్మెల్యే గణేష్, భీమానాయక్‌లు సిద్ధరామయ్య వర్గంలో.. మిగతావారు మంత్రి డీకే బృందంలో ఉన్నారని వ్యాఖ్యానించారు.

దీంతో బళ్లారి జిల్లా ఎమ్మెల్యేల్లో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయని విమర్శించారు. హొసపేటె ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్, గణేష్‌ మధ్య జరిగిన గొడవకు మూల కారణం మాజీ సీఎం సిద్ధరామయ్య, మంత్రి డి.కే.శివకుమారలేనని ఈ సందర్బంగా వారిద్దరిపై ఆరోపణలు గుప్పించారు గాలి జనార్దన్ రెడ్డి. ఎమ్మెల్యేల వద్ద ప్రాబల్యం చూపించుకుంటూ వీరిద్దరు ఇలాంటి పరిస్థితులను సృష్టిస్తున్నారని విమర్శించారు. ఆస్పత్రిలో బెడ్‌పైన పడుకుని ఉన్న తన స్నేహితుడు ఆనంద్‌సింగ్‌ను ఆ పరిస్థితిలో చూస్తే తనకు కళ్ళలో నీళ్ళు ఆగలేదని జనార్దన్ రెడ్డి అన్నారు.

లైవ్ టీవి

Share it
Top