ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయిన మాజీ ప్రధాని

ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయిన మాజీ ప్రధాని
x
Highlights

ఛాతి నొప్పితో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కాసేపటి క్రితమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కార్డియాలజీ...

ఛాతి నొప్పితో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కాసేపటి క్రితమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ నితీశ్ నాయక్ సారథ్యంలో ఆయనకు చికిత్స అందించారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన్ను డిశ్చార్జ్ చేశారు. కాగా, అంతకుముందు ట్రీట్మెంట్‌లో భాగంగా.. ఇచ్చిన మెడిసిన్ ద్వారా ఆయనకు జ్వరం రావడంతో ఆయనకు కరోనా పరీక్షలు కూడా నిర్వహించారు. అయితే రిపోర్టుల్లో నెగిటివ్ రావడంతో కరోనా సోకలేదని నిర్ధారించారు.

మన్మోహస్‌ సింగ్‌కు ఇప్పటికే రెండుసార్లు బైపాస్‌ సర్జరీ జరిగిన‌ట్లు తెలుస్తోంది. మన్మోహన్ సింగ్ ప్రస్తుతం రాజ్యసభలో పార్లమెంటు సభ్యుడిగా రాజస్థాన్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2004 నుంచి 2014 వరకు ఇండియాకు ప్రధాన మంత్రిగా సేవ‌లందించారు. ప్రధానమంత్రి గానే కాకుండా ఆర్థిక శాఖ మంత్రిగా కూడా మన్మోహన్ సింగ్ పని చేశారు. అంతేకాకుండా భారత రిజర్వు బ్యాంకుకి డైరెక్టర్ గా కూడా మన్మోహన్ సింగ్ వ్యవహరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories