మా చేత బీఫ్, పోర్క్ డెలివరీ చేయిస్తున్నారు: జొమాటో ఉద్యోగుల ఆందోళన

మా చేత బీఫ్, పోర్క్ డెలివరీ చేయిస్తున్నారు: జొమాటో ఉద్యోగుల ఆందోళన
x
Highlights

ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకు చెందిన ఉద్యోగులు పశ్చిమబెంగాల్ లో నిరవధిక ఆందోళనకు దిగారు. జొమాటో సంస్థ తమ మత విశ్వాసాలను కాదని ఆవు, ఎద్దు, గేదె...

ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకు చెందిన ఉద్యోగులు పశ్చిమబెంగాల్ లో నిరవధిక ఆందోళనకు దిగారు. జొమాటో సంస్థ తమ మత విశ్వాసాలను కాదని ఆవు, ఎద్దు, గేదె మాంసం, పంది మాసంలను తమ చేత కస్టమర్లకు పంపిస్తోందని మండిపడ్డారు. కంపెనీ తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము గత వారం రోజులుగా హౌరా బ్రిడ్జి వద్ద ఆందోళన చేస్తున్నా జొమాటో యాజమాన్యం పట్టించుకోలేదని విమర్శించారు.

జొమాటోకు చెందిన ఉద్యోగులు ఆందోళన విషయమై పశ్చిమబెంగాల్ మంత్రి రజిబ్ బెనర్జీ స్పందించారు. తమ మత విశ్వాసాలకు వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పే అధికారం ఏ సంస్థకూ లేదు. ఇది చాలా తప్పు. జొమాటో ఉద్యోగుల ఆందోళన విషయం నా దృష్టికి వచ్చిందని... ఈ వ్యవహారంలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని బెనర్జీ తెలిపారు. ఇటీవల ఓ ముస్లిం డెలివరీ బాయ్ నుంచి ఆర్డర్ తీసుకోవడానికి ఓ ఆకతాయి నిరాకరించాడు. ముస్లిం డెలివరీ బాయ్ నుంచి తాను ఆహారం తీసుకోననీ, తనుకు హిందువును పంపాలని కోరాడు. దీంతో ఆహారానికి మతానికి సంబంధం లేదనీ, ఆహారమే ఓ మతమని జొమాటో దీటుగా జవాబిచ్చింది. ఇది జరిగిన కొద్ది రోజులకే తాజా ఆందోళన రేగడం గమనార్హం.

ఇకపై తాము ఇలా పనిచేయబోమని చెబుతూ.. జొమాటో డెలివరీ బాయ్‌లందరూ ఆందోళన చేపట్టనున్నారు. ఇక జొమాటోలో తమకు అందుతున్న కమిషన్, మెడికల్, ఇతర సదుపాయాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని జొమాటో డెలివరీ బాయ్‌లు చెబుతున్నారు. అందుకనే తాము సోమవారం నుంచి సమ్మె చేపడుతున్నామని, అందులో భాగంగా నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతామని వారు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories