Top
logo

ఢిల్లీకి వరద ముప్పు..ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోన్న యమున నది

ఢిల్లీకి వరద ముప్పు..ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోన్న యమున నది
X
Highlights

ఢిల్లీలోని యమున నదిలో ప్రమాదకరస్థాయిలో వరద ఉధృతి ప్రవహిస్తోంది. హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

ఢిల్లీలోని యమున నదిలో ప్రమాదకరస్థాయిలో వరద ఉధృతి ప్రవహిస్తోంది. హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. హర్యానాలోని హత్నికుంద్ బ్యారేజ్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో దిగువకు 8 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో యమునా నది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. యమునా ప్రమాదకర హెచ్చరిక 204 మీటర్లు కాగా, డేంజర్ లెవల్ మార్క్ 204.50 మీటర్లు. యమునా నది పొంగడంతో ఢిల్లీకి వరద ముంపు పొంచి ఉంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యాయరు.

Next Story