ఫ్లెక్సీ కూలి యువతీ మరణం

ఫ్లెక్సీ కూలి యువతీ మరణం
x
Highlights

ఫ్లెక్సీ కూలి ఓ యువతి మరణించిన ఘటన చెన్నైలో జరిగింది. దక్షిణ చెన్నై పరిధిలోని పల్లికరనైలో ఫ్లెక్సీ కూలిపడడంతో.. శుభశ్రీ అనే యువతి ప్రాణాలు...

ఫ్లెక్సీ కూలి ఓ యువతి మరణించిన ఘటన చెన్నైలో జరిగింది. దక్షిణ చెన్నై పరిధిలోని పల్లికరనైలో ఫ్లెక్సీ కూలిపడడంతో.. శుభశ్రీ అనే యువతి ప్రాణాలు కోల్పోయింది. SRM ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ పూర్తి చేసిన శుభశ్రీ తురై పాక్కంలోని ఓ ప్రైవేట్ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమె గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బైక్‌పై ఇంటికి బయలు దేరింది. ఆమె పల్లికరనై మీదుగా వెళుతున్న సమయంలో.. ఆ ప్రాంతంలో వివాహ రిషెప్షన్‌ కోసం అన్నాడీఎంకే కార్యకర్తలు రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ నేలకొరిగింది. దీనిని గుర్తించిన శుభశ్రీ భయంతో బైక్‌ను పక్కకు నడిపే ప్రయత్నంలో అదుపుతప్పి కిందపడింది. అప్పుడు వెనుక నుంచి వచ్చిన గణపతి వాటర్‌ సప్లై ట్యాంకర్‌ లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుభశ్రీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. క్రోంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ట్యాంకర్‌ లారీ డ్రైవర్‌ మనో జ్‌ను అదుపులోకి తీసుకుని బ్యానర్‌ ఏర్పాటు చేసిన అధికార పార్టీ కార్యకర్తల కోసం గాలిస్తున్నారు. ఈ విషాద ఘటనపై స్థానికులు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయరాదని మద్రాసు హైకోర్టు స్పష్టంగా తీర్పుచెప్పింది.. అయితే దీనిని పాలకులుగాని, ట్రాఫిక్‌ విభాగం పోలీసులు గాని పాటించడం లేదని స్థానికులు ఆరోపించారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే శుభశ్రీ మరణించిందని ఈ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories