అదో వింత చేప... అచ్చు మనిషి ముఖమే

అదో వింత చేప... అచ్చు మనిషి ముఖమే
x
Highlights

ఎవరికీ ఎదురుకాని ఓ వింత అనుభవం ఓ యువతికి ఎదురైంది. చెరువులో తనకు కనిపించిన ఈ చేపను చూసి ‎ఆమె ఆశ్చర్యపోయింది.

చేపల్లో చాలా రకాల చేపలను ఇప్పటివరకూ మనందరం చూసే ఉంటాం. చాలా మంది జాలర్లు సముద్రంలో చేపలు పడుతూ ఉంటారు. సముద్రంలో జలకన్యలు ఉంటాయని వినడమే కానీ ఎప్పుడూ చూడలేదని వారు చెపుతుంటారు. కానీ వారికి ఎవరికీ ఎదురుకాని ఓ వింత అనుభవం ఓ యువతికి ఎదురైంది. చెరువులో తనకు కనిపించిన ఈ చేపను చూసి ‎ఆమె ఆశ్చర్యపోయింది. నిజమే మరి ఆ చేపను చూస్తే ఆశ్చర్యం కలిగించేలానే ఉంది. అచ్చు మనిషి ముఖం ఎలా ఉంటుందో అలాంటి ముఖంతో ఉంది.

ఈ వింత ఆకారం గల చేపను దక్షిణ చైనాలో మియో గ్రామంలో ఓ యువతి చెరువులో చూసింది. ఈ చేప రూపం వింతగా ఉండటంతో ఆశ్చర్యపోయింది. మనిషికి ఉన్నట్టుగానే ఆ చేపకు నోరు, ముక్కు, కళ్ళు ఉన్నాయి. ఆ చేప అలా అలా చెరువులో ఈదుకుంటూ వెలుతుంటే ఆ యువతి దాన్ని చూస్తూ వీడియో తీసింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories