రేపట్నుంచి 17వ లోక్‌సభ ప్రారంభం..

రేపట్నుంచి 17వ లోక్‌సభ ప్రారంభం..
x
Highlights

రేపటి నుంచి17వ లోక్ సభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 26వ తేదీ వరకు సమావేశాలు జరగనున్నాయి. మొదటి రెండు రోజులు లోక్‌సభలో సభ్యుల...

రేపటి నుంచి17వ లోక్ సభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 26వ తేదీ వరకు సమావేశాలు జరగనున్నాయి. మొదటి రెండు రోజులు లోక్‌సభలో సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది.19న స్పీకర్ ఎన్నిక జరగనుంది. 20న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసగించనున్నారు. జూలై 5న కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమం నేపథ్యంలో ప్రధాని మోఢీ అధ్యక్షతన ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. ప్రధానిగా మోడీ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని ప్రతిపక్ష పార్టీలను కోరారు ప్రధాని మోడీ.

కీలక బిల్లుల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ప్రతిపక్ష నేతలు స్పష్టం చేశారు. నిరుద్యోగం, వాక్ స్వాతంత్ర్యం, రైతాంగ సమస్యలపై సభలో చర్చించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లు, ఎన్నికల సంస్కరణలు తదితర బిల్లులపై ప్రభుత్వం దృష్టి సారించాలని తృణమూల్ కాంగ్రెస్ సూచించింది. రాష్ట్రాల వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం తగ్గించుకోవాలని హితవు పలికింది. అలాగే మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రెండు రోజుల పాటు ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది. ఎన్నికైన 542 మంది ఎంపీలు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories