తన రికార్డును తానే బద్దలు కొట్టిన నిర్మలా సీతారామన్..

తన రికార్డును తానే బద్దలు కొట్టిన నిర్మలా సీతారామన్..
x
Highlights

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శనివారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి 22...

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శనివారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి 22 లక్షల 46వేల కోట్ల రూపాయలతో కేంద్ర బడ్జెట్‌ను ఆమె ప్రవేశపెట్టారు. ఆర్ధిక మంత్రులు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆ బడ్జెట్ ప్రసంగానికి ఓ ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఈ సారి బడ్జెట్ ప్రసంగం చాలా సేపు కొనసాగింది. మొత్తం నిర్మలా సీతారామన్‌ ఏకంగా 2 గంటల 40 నిమిషాల పాటు బడ్జెట్‌ను చదివి వినిపించారు.

గతసారి 2019 బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆమె 2 గంటల 17 నిమిషాల పాటు బడ్జెట్‌ను చదివి వినిపించారు. అప్పుడు ఇది కూడా ఓ రికార్డే అని చెప్పాలి. గత సారితో పోలిస్తే ఆమె ఇప్పుడు 23 నిముషాలు ఎక్కువ సేపు బడ్జెట్ ని చదివి వినిపించారు. దీనితో ఆమె రికార్డును ఆమె బద్దులు కొట్టుకున్నట్టు అయింది.

2014లో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2 గంటల 10 నిమిషాల పాటు బడ్జెట్‌ను చదివి వినిపించారు. ఇక 2015లో ఆయన రెండోసారి బడ్జెట్ ని ప్రవేశ పెట్టారు అప్పుడు రెండు గంటల పాటు బడ్జెట్‌ను చదివి వినిపించారు. ఇక 2017లో బడ్జెట్ ప్రసంగాన్ని ఒక గంట యాబై నిముషాలు చదివారు. ఇక చివరగా 2018లో అయన ఒక గంట నలబై తొమ్మిది నిముషాలు చదివారు.

అత్యధిక సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు మొరార్జీ దేశాయ్ పేరిట ఉంది. ఆ తర్వాతి స్థానంలో మాజీ మంత్రి పి.చిదంబరం నిలిచారు. ఆయన ఏకంగా 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక ఆ తరవాత భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉన్నారు. అయన ఎనమిది సార్లు బడ్జెట్ ని ప్రవేశపెట్టారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories