భార్యను హత్య చేసిన భర్త.. భర్తని పట్టిస్తే 70 లక్షలు..

భార్యను హత్య చేసిన భర్త.. భర్తని పట్టిస్తే 70 లక్షలు..
x
Highlights

2015 ఏప్రిల్ లో ఇద్దరూ డోనట్ స్టోర్ లో రాత్రి విధులు నిర్వహించారు. ఆ తర్వాత పాలక్ మృతదేహం దారుణ స్థితిలో కనిపించింది. అమె శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయి.

కట్టుకున్న భార్యను చంపాడు.. ఇప్పుడు ఆ చంపినా భర్తను పట్టిస్తే రూ.70 లక్షల నగదుని బహుమతిగా ఇస్తామని అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) ప్రకటించింది. ఇక వివరాల్లోకి వెళ్తే అహ్మదాబాద్ కు చెందిన భద్రేశ్ కుమార్ (24), పాలక్ (21)లు భార్యాభర్తలు అమెరికాలో నివాసం ఉంటున్నారు. అక్కడే హనోవర్ మేరిల్యాండ్ లోని డంకిన్ డోనట్ స్టోర్ లో పనిచేపేవారు. అయితే 2015 ఏప్రిల్ లో ఇద్దరూ డోనట్ స్టోర్ లో రాత్రి విధులు నిర్వహించారు. ఆ తర్వాత పాలక్ మృతదేహం దారుణ స్థితిలో కనిపించింది. అమె శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయి.

దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. అందులో భాగంగా అధికారులు స్టోర్ లోని సీసీఫుటేజీని పరిశీలించి ఆశ్చర్యపోయారు. హత్య జరిగిన రోజు రాత్రి భద్రేశ్ కుమార్ తన భార్య పాలక్ తో కలిసి స్టోర్ వంట గదిలోకి వెళ్లాడు.ఆ తర్వాత భద్రేశ్ కుమార్ బయటికి వచ్చేయడం సీపీఫుటేజీలో కనిపించింది. స్టోర్ నుంచి కాలినడకన ఇంటికి వెళ్లి తన వ్యక్తిగత సామన్లను తీసుకొని పరారయ్యాడు.

అయితే అతన్ని పట్టుకునేందుకు ఎఫ్ బీఐ బాగానే ప్రయత్నం చేస్తుంది కానీ చిక్కడం లేదు. తమ కళ్లు కప్పి తిరుగుతున్న అతి ముఖ్యమైన పది మంది నిందితుల్లో భద్రేశ్ కుమార్ ఒకరని ఎఫ్ బీఐ తెలిపింది. అతని కోసం ఎఫ్ బీఐ అమెరికా, భారత్ లలో తీవ్రంగా గాలిస్తోంది.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories