తండ్రికిచ్చిన మాట కోసం...

తండ్రికిచ్చిన మాట కోసం...
x
Highlights

తండ్రికి ఇచ్చిన మాట కోసం తన వయస్సును, ఆర్థిక పరిస్థితులను కూడా లెక్క చేయకుండా అనుకున్నదాన్ని సాధించింది ఓ మహిళ. చదువు కొనసాగించడానికి వయస్సు, ఆర్ధిక...

తండ్రికి ఇచ్చిన మాట కోసం తన వయస్సును, ఆర్థిక పరిస్థితులను కూడా లెక్క చేయకుండా అనుకున్నదాన్ని సాధించింది ఓ మహిళ. చదువు కొనసాగించడానికి వయస్సు, ఆర్ధిక పరిస్థితులు ఏవీ అడ్డుగోడలు కావని, మనస్సులో ధృడ నిశ్చయం ఉంటే దేన్నైనా సాధించవచ్చని నిరూపించింది. ఎంతో కష్టపడి న్యాయ మూర్తి పరీక్షలో ఉత్తీర్ణత సాధించి త్వరలోనే బాధ్యతను చేపట్టనుంది.

పూర్తి వివరాల్లోకెళితే బీహార్ కు చెందిన గౌరీనందన్, సరన్ జిల్లా సోన్ పూర్ న్యాయస్థానంలో ప్యూన్ గా విధులు నిర్వహిస్తుండే వారు. ఆ‍యనకు అర్చన అనే కుమార్తె ఉంది. ఆమె చిన్నతనంలో ఉన్నప్పుడు ఎప్పటికైనా నువు మంచి న్యాయమూర్తి కావాలని ఆమెను కోరారు. దాంతో ఆమె చిన్నప్పుడే తన తండ్రికి న్యాయమూర్తి అవుతానని మాటిచ్చింది. ఇప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది.

అర్చన శాస్త్రి నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్ ఉత్తీర్ణురాలైంది. అనంతరం పట్నా విశ్వవిద్యాలయంలో తన చదువుని కొనసాగించింది. తన కుటుంబానికి ఆర్థికంగా సాయపడడానికి కొన్ని రోజులు కంప్యూటర్ టీచర్ గా పనిచేసింది. కొన్ని రోజుల తరువాత తనకు రాజీవ్ రంజన్ అనే అతనితో వివాహం జరిపించారు తన కుటుంబ సభ్యులు. పె‌ళ్ళయ్యాక ఇంక తన విద్య కొనసాగదేమోనని ఆందోళన చెందింది. కానీ తాను చిన్నప్పటి నుంచి కన్న కలను తెలుకున్న అర్చన భర్త తనకు అండగా నిలిచాడు. ఆమెని కష్టపడి చదించాడు. దాంతో తనకు ఐదేండ్ల కూతురు ఉన్నప్పటికీ తనని చూసుకుంటూ పట్టుదలతో చదువుకుంది. బీహార్ జుడీషియల్ సర్వీస్ పరీక్షలో రెండో ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించింది.

అయితే ఇప్పుడు అర్చన విజయాన్ని చూడడానికి తన తండ్రి లేడని ఆమె ఎంతగానో బాధపడింది. తన తండ్రి చనిపోయిన తరువాత చదువును కొనసాగించడం అంత సులభంగా లేదని తెలిపింది. అన్ని పరిస్థితులను ఎదుర్కొని తన తల్లి కూడా తనకు ఎంతో అండగా నిలించిందని తెలిపింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories