టోల్‌గేట్ల వద్ద పడిగాపులు కాసే విధానానికి స్వస్తి.. ఫాస్టాగ్‌ విధానాన్ని తీసుకురానున్న కేంద్రం

టోల్‌గేట్ల వద్ద పడిగాపులు కాసే విధానానికి స్వస్తి.. ఫాస్టాగ్‌ విధానాన్ని తీసుకురానున్న కేంద్రం
x
Highlights

టోల్‌గేట్ల వద్ద గంటలకొద్దీ పడిగాపులు కాసే విధానానికి కేంద్రం ఇక స్వస్తి పలికనుంది. ఇందుకోసం ఫాస్టాగ్‌ విధానాన్ని తీసుకురానుంది. డిసెంబరు ఒకటవ తేదీ...

టోల్‌గేట్ల వద్ద గంటలకొద్దీ పడిగాపులు కాసే విధానానికి కేంద్రం ఇక స్వస్తి పలికనుంది. ఇందుకోసం ఫాస్టాగ్‌ విధానాన్ని తీసుకురానుంది. డిసెంబరు ఒకటవ తేదీ నాటికి ఈ సదుపాయం అందుబాటులోకి రానున్నది. ఈ ఫాస్టాగ్‌ విధానం... వాహనాలు టోల్‌ప్లాజాల వద్ద ఆగకుండా వెళ్లిపోయేందుకు సహకరిస్తుంది. టోల్‌ప్లాజాల వద్ద ఉన్న గేట్లలో ఒక్కటి మినహా అన్నీ ఫాస్టాగ్‌ ఆధారంగా పనిచేసేలా ఆధునికీకరించనున్నారు. ఫాస్టాగ్‌ స్టిక్కర్లు ప్రతి టోల్‌ప్లాజా వద్ద, గుర్తింపు పొందిన బ్యాంకుల్లో లభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఫాస్టాగ్ అంటే టోల్ ప్లాజాకు చెల్లించాల్సిన రుసుమును ముందుగా ఫాస్టాగ్ పేరుతో ప్రభుత్వం ఎలాక్ట్రానిక్ స్టిక్కరు తయారుచేసింది.

ఫాస్టాగ్ నేషనల్ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు విక్రయిస్తున్నాయి. పేటీఎం, అమెజాన్ వంటి ఆన్ లైన్ విక్రయ సంస్థలు కూడా అమ్మేందుకు ఓప్పందాలు చేసుకున్నాయి.

వాహనాదారులకు అందుబాటులో ఉంచేందుకు ఫాస్టాగ్ ధర 100 రూపాయిల నుంచి ప్రారంభమవుతోంది. ఫాస్టాగ్ తీసుకోవాలంటే బ్యాంకుల్లో మోటారు వాహనాల 24 ఆర్సీ, అలాగే వాహనదారుడి ఆధార్‌ లేదా ఏదైనా గుర్తిపు కార్డు నకలు తప్పని సరి. వాహనం ఏదైనా 24గంటల్లోగా తిరిగి రాకపోకలు చేస్తే మొత్తం సొమ్ముకాకుండా రాకపోకలకు అయ్యే మొత్తాన్ని మాత్రమే చార్జీ చేస్తుంది. ఈ నూతన విధానం డిసెంబరు 1వతేదీన టోల్ ప్లాజా దగ్గర రుసుమును నగదు రూపంలో పరిమిత కౌంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories