ఫేక్ న్యూస్ : 1000 నోటు మార్కెట్‌లోకి..!

ఫేక్ న్యూస్ : 1000 నోటు మార్కెట్‌లోకి..!
x
Highlights

పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. వాటి ప్లేస్ లో కొత్త రూ.2000, రూ.500 నోట్లను ప్రవేశపెట్టింది.. ఇక పాత...

పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. వాటి ప్లేస్ లో కొత్త రూ.2000, రూ.500 నోట్లను ప్రవేశపెట్టింది.. ఇక పాత వంద, యాబై, పది రూపాయల నోట్లను అలాగే ఉంచి కొత్తవాటిని అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటికి తోడు 200 రూపాయల నోటును అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే గత కొద్ది కాలంగా రూ .2వేల నోటును ఆర్‌బీఐ బ్యాన్ చేసి మళ్లీ రూ. 1000 నోటును అందుబాటులోకి తీసుకొస్తుందన్న వార్తలు ఉపందుకున్నాయి..

అందులో భాగంగానే సోషల్ మీడియాలో రూ.1000 నోటు కొత్త రూపుతో ప్రత్యక్షమైంది. ఇదే కేంద్రం విడుదల చేసే రూ. 1000 నోటు అని ప్రచారం జరుగుతుంది. దీనిని మాత్రం ఫేక్ గానే పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది.ఎందుకంటే దీనిపై ఆర్‌బీఐ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.. ఇక్కడ విశేషం ఏంటంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 1000 నోటుపై ఆర్‌బీఐ గవర్నర్‌ సంతకంకి బదులు మహాత్మాగాంధీ సంతకం ఉండడం... సో ఇది పక్కా ఫేక్ న్యూస్ అని మనం పరిగణించవచ్చు..





Show Full Article
Print Article
More On
Next Story
More Stories