అమ్మాయి కోసం వెళ్తే అల్లుడ్ని చేసుకున్నారు ...

అమ్మాయి కోసం వెళ్తే అల్లుడ్ని చేసుకున్నారు ...
x
Highlights

వారిద్దరూ ప్రేమికులు ... ఫేస్ బుక్ సాక్షిగా వారి ప్రేమ మొదలైంది . అమ్మాయిని కలవడానికి అ అబ్బాయి ఇంటికి వస్తే అ అమ్మాయి పెద్దలు ఏకాంగా అల్లుడ్ని...

వారిద్దరూ ప్రేమికులు ... ఫేస్ బుక్ సాక్షిగా వారి ప్రేమ మొదలైంది . అమ్మాయిని కలవడానికి అ అబ్బాయి ఇంటికి వస్తే అ అమ్మాయి పెద్దలు ఏకాంగా అల్లుడ్ని చేసుకున్నారు . అది ఎలా అంటే ఇక పూర్తి స్టొరీలోకి వెళ్ళాల్సిందే ... ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది . బాలేశ్వర్ జిల్లా గులునియా గ్రామానికి చెందిన సురేంద్ర బెహెరా కుమార్తె, కుబబపాట్న గ్రామానికి చెందిన బై కుంటకు ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. అ పరిచయం కాస్తా ప్రేమగా మారింది . కొన్ని సార్లు కలవాలని అనుకున్నారు . కానీ కుదరలేదు.

ఈ సారి యువతీ ఏకాంతంగా ఉన్న సమయంలో అతన్ని ఇంటికి ఆహ్వానించింది. అ అమ్మాయిని కలిసేందుకు అ అబ్బాయి ఇంటికి వచ్చాడు. కాసేపటికి అ అమ్మాయి తల్లితండ్రులు కూడా వచ్చారు. అప్పుడు అ అమ్మాయిని ఎవరితను అని తల్లితండ్రులు ప్రశ్నించగా వారి ప్రేమ విషయాన్ని మొత్తం బయటపెట్టింది. వీరిది నిజమైన ప్రేమని తెలుసుకున్నాక అమ్మాయి తల్లితండ్రులు ఆ రోజే సాంప్రదాయ పద్ధతిలో ఇద్దరికీ పెళ్లి చేసారు . దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories