పాఠాలను చదవలేని ఇంగ్లీష్ టీచర్

పాఠాలను చదవలేని ఇంగ్లీష్ టీచర్
x
Highlights

ఒక విద్యార్థి గొప్ప స్థాయికి చేరుకోవాలంటే ముందుగా పాఠశాలలో ఉపాధ్యాయులు సరిగ్గా చదువు చెప్పేవారై ఉండాలి.

ఒక విద్యార్థి గొప్ప స్థాయికి చేరుకోవాలంటే ముందుగా పాఠశాలలో ఉపాధ్యాయులు సరిగ్గా చదువు చెప్పేవారై ఉండాలి. అసలు చదువు నేర్పే ఉపాధ‌్యాయులకే చదువు రానప్పుడు ఇక విద్యార్ధులకు ఏం పాఠాలు బోధిస్తారు. అలాంటి టీచర్ల వద్దకు వెళ్లిన విద్యార్థుల చదువులు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. ఇప్పుడిదంతా ఎందుకనుకుంటున్నారా ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఈ విషయం తెలుసుకుంటే మీకే అర్థం అవుతుంది.

ఉత్తర ప్రదేశ్ లోని సికిందర్ పూర్ సరౌసి అనే గ్రామంలో ఒక ప్రభుత్వ పాఠశాల ఉంది. ఆ పాఠశాలను తనిఖీ చేయడానికి గురువారం అనుకోకుండా జిల్లా మెజిస్ట్రేట్ దేవేంద్ర కుమార్ పాండే వచ్చారు. అన్ని తరగతులను తనిఖీ చేసుకుంటూ ఒక తరగతిలో ఆగారు. అక్కడ ఉన్న విద్యార్థలకు ఇంగ్లీష్ పుస్తకం చేతికిచ్చి చదవమన్నారు. విద్యార్థులతో పాటుగానే అక్కడే ఉన్న ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలిని కూడా పాఠ్యాంశంలోని రెండు లైన్లను చదవమన్నారు.

అప్పడు మొదలైంది అసలు కథ. పుస్తకం ఇవ్వగానే పుస్తకాన్ని చూస్తూ చిన్న పిల్లలు ఏబీసీడీలు చదివినట్టుగా రెండు లైన్లను చదివింది. ఆమె చదివిన తీరును గమనించిన మెజిస్ట్రేట్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం పాఠ్యాంశాన్ని చదవడానికి కూడా రాకుండా పిల్లలకు ఏం పాఠాలు బోధిస్తున్నావంటూ అడిగారు. ఈ విధంగా పాఠాలు చెబితే పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని పాఠశాల ఉపాధ్యాయులను ప్రశ్నించారు. ఆమెను వెంటనే విధులనుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.

దీంతో అక్కడే ఉన్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సహ ఉపాధ్యాయులు ఆయనకు సర్ది చెప్పడానికి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మెజిస్ట్రేట్ సరేమిరా అనడంతో ఆమెను విధుల నుంచి తొలగించారు. ఇలాంటి ఉపాధ్యాయులు ఉంటే పిల్లల భవిష్యత్తుల పాడవుతుందని, విద్యార్థులకు పాఠ్యాంశాల పరంగా చాలా నష్టం కలుగుతుందని ఆయన తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories