logo
జాతీయం

ఒకవైపు వడగాలులు.. మరోవైపు మెదడువాపు రోగులు.. బీహార్‌లో పిట్టల్లా రాలుతున్న జనం..

ఒకవైపు వడగాలులు.. మరోవైపు మెదడువాపు రోగులు.. బీహార్‌లో పిట్టల్లా రాలుతున్న జనం..
X
Highlights

బీహార్‌లో మెదడువాపు వ్యాధితో మరో పది మంది చిన్నారులు మరణించారు. దీంతో కేవలం 15 రోజుల్లో ఈ వ్యాధితో మరణించిన...

బీహార్‌లో మెదడువాపు వ్యాధితో మరో పది మంది చిన్నారులు మరణించారు. దీంతో కేవలం 15 రోజుల్లో ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య 84కు చేరుకుంది. మృతుల్లో ఎక్కువ మంది 10 ఏండ్లలోపు వారే ఉన్నారు. ఈ మరణాలన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీకృష్ణ మెడికల్ కాలేజ్, దవాఖాన.. ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న కేజ్రీవాల్ దవాఖానలో చోటుచేసుకున్నాయి. వేసవి కావడంతో పాటు మండే ఎండల కారణంగా హైపోగ్లిసిమియా అనే బ్రెయిన్ ఫీవర్ చిన్నారులకు సోకుతుందని ఈ ఫీవర్‌తో మెదడు దెబ్బేనని దీని ప్రభావంతో పక్షవాతం, కోమా ఏర్పడటం వంటి అవకాశాలున్నాయని 15 ఏళ్లకు లోబడిన వారు ఈ వ్యాధి సులభంగా సోకుతుందని దీంతో మృతుల సంఖ్య కూడా పెరుగుతుందని వైద్యులు చెప్పారు.

Next Story