logo
జాతీయం

జనం లేక వెలవెలబోయిన కేజ్రీవాల్‌ ర్యాలీ

జనం లేక వెలవెలబోయిన కేజ్రీవాల్‌ ర్యాలీ
X
Highlights

ఆమ్‌ ఆద్మీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చేపట్టిన ర్యాలీకి జనం మద్దతు పెద్దగా లభించలేదు....

ఆమ్‌ ఆద్మీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చేపట్టిన ర్యాలీకి జనం మద్దతు పెద్దగా లభించలేదు. దాంతో ఈ ర్యాలీ జనం లేక వెలవెలబోయింది. ఖాళీ కుర్చీలు వెక్కిరించడంతో కేజ్రీవాల్‌ మొక్కుబడిగా ప్రసంగించి హర్యానాలో మరో ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉందంటూ అక్కడి నుంచి వెనుదిరిగారు. షెడ్యూల్‌ ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు కేజ్రీవాల్‌ ప్రసంగం ప్రారంభకావాల్సి ఉండగా జనం పలుచగా ఉండటంతో 2.30 మొదలయింది. ఆ తరువాత కూడా జనం రాకపోవడంతో ఆ పార్టీ నేతలు డీలా పడ్డారు. కాగా కేజ్రీవాల్‌ తన ప్రసంగం మొత్తం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ క్రమంలో స్ధానిక బీజేపీ ఎంపీ కిరణ్‌ ఖేర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆమె అటు లోక్‌సభకు హాజరు కాకపోవడంతో పాటు ఇటు చండీగఢ్‌లోనూ ప్రజలకు ముఖం చూపించరని ఆరోపించారు.

Next Story