నిట్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం జేఈఈ మెయిన్స్ ప్రారంభ, చివరి ర్యాంకుల వివరాలు

నిట్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం జేఈఈ మెయిన్స్ ప్రారంభ, చివరి ర్యాంకుల వివరాలు
x
Highlights

దేశవ్యాప్తంగా నిర్వహించే ఇంజనీరింగ్ పరీక్ష జేఈఈ మెయిన్స్ ద్వారానే ప్రతిష్టాత్మక నిట్ కళాశాల్లో సీట్ల కేటాయింపు ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రాచుర్యం...

దేశవ్యాప్తంగా నిర్వహించే ఇంజనీరింగ్ పరీక్ష జేఈఈ మెయిన్స్ ద్వారానే ప్రతిష్టాత్మక నిట్ కళాశాల్లో సీట్ల కేటాయింపు ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన నేషనల్ టెక్నికల్ ఇన్ స్టిట్యూషన్స్ (నిట్) దేశంలో ప్రస్తుతం 31 ఉన్నాయి. ఇవి భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇందులో సీట్ల కేటాయింపు జేఈఈ మెయిన్స్ లో వచ్చిన ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. ఇందులో ఎంపికైనా అభ్యర్థులు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జేఓఎస్ఏఏ)లో అడ్మిషన్ పొందుతారు.

నిట్ లలో సీట్ల కేటాయింపు ప్రధానంగా మెరిట్ పైనే ఆధారపడి ఉంటుంది. కొన్ని పేమెంట్ సీట్లు కూడా ఇందులో ఉంటాయి. మొదట మీరు నిట్ లో చేరాలనుకుంటే ఆ నిట్ కటా ఆఫ్ మార్కులను తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆ నిట్ లో ఫీజు ఎంత ఉందని నిర్ధారించుకొని చేరాల్సి ఉంటుంది. నిట్ ల ర్యాంకులు తెలుసుకోవాలంటే పోయిన సంవత్సరం ఆ కళాశాలలో ఎంతవరకు కట్ ఆఫ్ అయిందో నిర్ధారించుకొని ప్రారంభ, చివరి ర్యాంకులను ఈ సంవత్సరం అంచనా వేసుకోవచ్చు. అధికారికంగా సీట్ల కేటాయింపు జేఈఈ మెయిన్స్ లో వచ్చిన ర్యాంకుల ఆధారంగానే తెలుస్తుంది. జనవరి, ఏప్రిల్ లో జరిగే పరీక్షల్లో వచ్చిన మార్కులనే పరిగణలోకి తీసుకుంటారు.

నిట్ కాలేజీల్లో జేఈఈ మెయిన్ కట్ ఆఫ్ వివరాలు

జేఈఈ మెయిన్ పరీక్షకు అర్హత పొందడానికి అవసరమైన కనీస మార్కులనే జేఈఈ కట్ ఆఫ్ మార్కులు అంటారు. అయితే వివిధ అంశాలపై కూడా ఈ కట్ ఆఫ్ మార్కులు ఆధారపడి ఉంటాయి. జేఈఈ కట్ ఆఫ్ మార్కుల గురించి ప్రాథమిక అవగాహన కోసం మేము గత సంవత్సరం జేఈఈ మెయిన్ కట్ ఆఫ్ ఏ ర్యాంకు వరకు వచ్చిందో కింద టేబుల్ లో చూడొచ్చు.

జేఈఈ మెయిన్ రాసిన అభ్యర్థులు జేఈఈ మెయిన్ ర్యాంకులను, జేఈఈ ఉన్న రాష్ట్రంలోని కట్ ఆఫ్ మార్కులను మునుపటి సంవత్సరానికి సంబంధించినవి పరిశీలించడం ద్వారా ఈ సంవత్సరం జేఈఈ మెయిన్ కట్ ఆఫ్ ఏ ర్యాంకు వరకు అవుతుందో అంచనా వేయవచ్చు. వివిధ కేటగిరీల వారీగా మునుపటి సంవత్సరం జేఈఈ ప్రధాన కట్ ఆఫ్ మార్కులు ఇవే..

JEE Mains for admission in Nit College Cut Off 2018- Category Wise

Applicant's Category JEE Main cut-off (2018)

పీడబ్లూడీ PwD 35

ఎస్సీ SC 29

ఎస్టీ ST 24

ఓబీసీ-ఎన్.సీఎల్ OBC-NCL 45

కామన్ ర్యాంకు లిస్ట్ Common Rank List 74

జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంక్ మరియు వివిధ కళాశాలల్లో కట్ ఆఫ్ మార్కులే అభ్యర్థి తన భవిష్యత్ కాలేజీ నిర్ణయించుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆయా కాలేజీల్లో జేఈఈ మెయిన్ మార్కులు ప్రారంభ, ముగింపు ర్యాంకులను చూసి ఆ కాలేజీ సామర్థ్యాలను అంచనావేయవచ్చు. మంచి ర్యాంకుల వారు చేరితే అది బెస్ట్ కాలేజీగా నిర్ధారించుకోవచ్చు.

కట్ ఆఫ్ జాబితాలు ఆయా కళాశాలాల్లో అత్యధిక ర్యాంకు.. అత్యల్ప ర్యాంకులను గుర్తించి కాలేజీలో మన ర్యాంకు ఆ కాలేజీలో సీటు వస్తుందో రాదో అంచనా వేసుకోవచ్చు. కళాశాలల్లో చివరి ర్యాంకు/కట్ ఆఫ్ ర్యాంకులను బట్టి ఆ కాలేజీల్లో ఎంతవరకు చివరి ర్యాంకులు వస్తాయనేది నిర్ణయించుకొని కాలేజీలను ఎంపిక చేసుకోవచ్చు. మీరు ర్యాంకు కంటే తక్కువ ర్యాంకులు భర్తీ చేసిన కాలేజీల్లో చేరకపోవడమే మీ భవిష్యత్ కు మంచిది. మీ ర్యాంకుకు పైన భర్తీ అయిన కాలేజీల్లోనే చేరితే మీ భవిష్యత్ బాగుంటుంది.

జేఈఈ మెయిన్ 2018 ప్రారంభ మరియు చివరి కట్ ఆఫ్ ర్యాంకుల వివరాలు

NITs కాలేజీలు ప్రారంభ/అత్యధిక కట్ ఆఫ్ చివరి/సాధారణ కట్ ఆఫ్ మార్కులు

NIT పాండిచ్చేరి 5377 22276

BIT Patna 16775 28684

AB Vajpayee 3419 20927

IT and Management Gwalior

BIT Ranchi 4818 13285

BIT Deoghar 8290 39292

IIT D&M, TN 1542 17503

Faculty of Engineering Haridwar 1170 36709

IIIT Allahabad 109 14757

DR. Bheem Rao Ambedkar NIT, Jalandhar 4303 22540

Indian Institute of Engineering Science and Technology, Shibpur 7982 30886

Indian Institute of Technology IIT Nagpur 15794 8135

Indian Institute of Technology IIT Pune 6060 6558

Indian Institute of Technology IIIT Srirangam Tiruchirappalli 18473 31157

Indian Institute of Technology IIT Design and Manufacturing Kurnool Andhra Pradesh 10736 12639

NIT Patna 6861 18903

NIT Nagaland 12446 40511

NIT Calicut 470 17731

NIT Delhi 707 13423

NIT Goa 2574 18383

NIT Sikkim 9446 31946

NIT Durgapur 7376 21206

NIT Jamshedpur 3318 13041

NIT Hamirpur 5200 12743

NIT Manipur 10577 38742

NIT Mizoram 8929 34658

NIT Kurukshetra 874 8916

NIT Meghalaya 12185 34830

NIT Raipur 7280 17664

NIT Rourkela 1005 6091

NIT Srinagar 3411 29643

NIT Agartala 4080 25737

NIT Uttarakhand 5535 19466

NIT Silchar 2797 15557

NIT Warangal 33 2100

NIT Surathkal 11 4468

NIT Tiruchirappalli 1056 15416

జేఈఈ మెయిన్ కట్ ఆఫ్ ర్యాంకులను ప్రభావితం చేసే అంశాలివే..

*ప్రతీ సంవత్సరం జేఈఈ మెయిన్స్ కు వచ్చిన దరఖాస్తులను బట్టి పోటీ, ర్యాంకులు మారుతుంటాయి

*జేఈఈ మెయిన్స్ గత సంవత్సరం రాసిన పరీక్షలో కట్ ఆఫ్ ట్రెండ్స్ ను గమనించాలి

*గత సంవత్సరం అడిగిన ప్రశ్నలు.. వాటి కఠినత్వాన్ని అంచనావేయాలి..

*జేఈఈ మెయిన్ పరీక్షలో మొత్తం అభ్యర్థుల శక్తి సామార్థ్యాలు, ర్యాంకులు అంచనావేయాలి..

*జేఈఈ మెయిన్స్ పరీక్ష గురించి..

+ ఎన్.టీ.ఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ఈ సంవత్సరం నుంచి జేఈఈ ప్రధాన పరీక్షను నిర్వహిస్తోంది. జనవరి మరియు ఏప్రిల్ నెలలో జేఈఈ ప్రధాన పరీక్షను దేశవ్యాప్తంగా రెండు సార్లు నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఆన్ లైన్ లోనే కంప్యూటర్ తెరలపై ఆప్జెక్టివ్ టైప్ ప్రశ్నల ఆధారంగా జరుగుతుంది.

+జేఈఈ మెయిన్ తొలి పరీక్ష 2019 జనవరి 6నుంచి 20 వ తేదీల మధ్య జరిగింది. ఇక రెండో జేఈఈ పరీక్ష ఏప్రిల్ 6నుంచి 20వ తేదీల మధ్య జరుగుతుంది. జనవరిలో పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు డిసెంబర్ 17, 2018 నుంచి అడ్మిట్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫలితం జనవరి 31,2019న వెలువడుతుంది. ఇక 30 ఏప్రిల్ 2019న రెండో ప్రధాన పరీక్ష ఫలితాలు వెల్లడిస్తారు.

+జేఈఈ పరీక్షలో కట్ ఆఫ్ మార్కులు రావాలంటే మీరు మునుపటి సంవత్సరం కన్నా ఎక్కువ మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇందుకోసం మంచి శిక్షణ, సరైన మార్గనిర్ధేశకత్వం, సరైన వ్యూహాలతో ముందుకెళితే మంచి మార్కులు సాధించవచ్చు. మీరు కలలుగన్న కాలేజీలో ర్యాంకును సొంతం చేసుకోవచ్చు.

+ఇక జేఈఈ మెయిన్స్ రాసేవారు తప్పనిసరిగా పరీక్షకు సంబంధించిన ''జేఈఈ మెయిన్ ప్రిపరేషన్ యాప్'' ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇందులో ఉచితంగా స్టడీ నోట్స్, క్విజ్, మాక్ టెస్టులు, గత సంవత్సరానికి సంబంధించిన ప్రశ్నాపత్రాలు.. ఐఐటీ జేఈఈ పరీక్షకు సంబంధించిన అన్ని అప్ డేట్ లు ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories