కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..ఇ-సిగరెట్లపై నిషేధం..

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..ఇ-సిగరెట్లపై నిషేధం..
x
Highlights

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. ఇ-సిగరెట్లపై నిషేధం విధించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా నీతారామన్‌ ప్రకటించారు. పొగాకు వినియోగం వ‌ల్ల...

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. ఇ-సిగరెట్లపై నిషేధం విధించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా నీతారామన్‌ ప్రకటించారు. పొగాకు వినియోగం వ‌ల్ల పిల్ల‌ల ఆరోగ్యం క్షీణిస్తోంద‌న్నారు. ఈ-సిగ‌రెట్ల ఉత్ప‌త్తి, దిగుమ‌తులు, ఎగుమ‌తులు, ర‌వాణా, అమ్మ‌కాలు, స‌ర‌ఫ‌రా, నిలువ చేయ‌డం, వాటిపై వాణిజ్య ప్ర‌క‌ట‌న ఇవ్వడం కూడా ఇక నుంచి నిషేధమే అని సీతారామ‌న్ చెప్పారు. నియ‌మావ‌ళిని ఉల్లంఘించిన వారి ప‌ట్ల కూడా క‌ఠిన చ‌ర్య‌లు కూడా తీసుకోనున్నారు. ఈ-సిగ‌రెట్లు క‌లిగి ఉన్న‌వారికి ఏడాది జైలు శిక్ష‌ను అమ‌లు చేయ‌నున్నారు. వారికి అద‌నంగా ల‌క్ష జ‌రిమానా కూడా విధించ‌నున్నారు. ఎల‌క్ట్రానిక్ నికోటిన్‌ను అదుపు చేయాల‌ని ఇప్ప‌టికే అన్ని రాష్ట్రాలు, యూటీల‌కు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసిన‌ట్లు మంత్రి తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories