కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై ప్రియాంకా గాంధీ కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై ప్రియాంకా గాంధీ కీలక వ్యాఖ్యలు
x
Highlights

రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన వారసుడు ఎవరనేది.. ఇటు పార్టీ నాయకులను, అటు కార్యకర్తలను వేధిస్తోంది. అయితే కొందరు...

రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన వారసుడు ఎవరనేది.. ఇటు పార్టీ నాయకులను, అటు కార్యకర్తలను వేధిస్తోంది. అయితే కొందరు మాత్రం ఆ స్థానంలో తిరిగి రాహుల్ గాంధీయే పగ్గాలు చేపట్టాలని డిమాండ్ చేయగా, ఇక మరికొందరైతే లేదు లేదు అన్ని తెలిసిన సోనియాగాంధీకే తిరిగి పగ్గాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మరో పేరు బయటకు వచ్చింది. ఆ పేరే కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా. ప్రియాంకా గనుక అధ్యక్ష బాధ్యతలు చేపడితే పార్టీ పరిస్థితి చాలా చాలా బాగుంటుందని, కేడర్‌లో కొత్తనోత్తేజం వస్తుందని కొందరు అగ్ర నేతలు గట్టిగానే వాదిస్తున్నారు. ఖచ్చితంగా ఆ బాధ్యత పగ్గాలు ప్రియాంక గాంధీకే అప్పగించాలని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రతిపాదించాగా... దీని ప్రియాంకా గాంధీ వాద్రా స్పందింస్తూ.. ఇలాంటి వాటిలో నన్ను దయచేసి లాగొద్దని ప్రియాంక నేతలకు విజ్ఞప్తి చేశారు.

కాగా ఈ నెల 20న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించేందుకు నేడు ప్రియాంకా గాంధీ నేతృత్వంలో పార్టీ నేతలు సమావేశం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తరువాత కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ప్రియాంకగాంధీ చేపట్టాలంటూ కొందరు ఆమె వద్ద ప్రస్తావించారు. అయితే, వెంటనే ఆమె అందులోకి నన్ను లాగొద్దు అని సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories