ఆరోగ్య సూత్రం పాటిస్తున్న శునకం..ఏం చేసిందంటే.

ఆరోగ్య సూత్రం పాటిస్తున్న శునకం..ఏం చేసిందంటే.
x
Highlights

గత రెండు, మూడు నెలలుగా మార్కెట్ లో ఎక్కువగా అమ్ముడు పోతున్న వస్తువులు ఏంటని అడిగితే మాస్కులు, శానిటైజర్లు అని చెపుతున్నారు.

గత రెండు, మూడు నెలలుగా మార్కెట్ లో ఎక్కువగా అమ్ముడు పోతున్న వస్తువులు ఏంటని అడిగితే మాస్కులు, శానిటైజర్లు అని చెపుతున్నారు.ఇంతకు ముందు ఎక్కువగా ఉపయోగంలో లేని ఈ రెండు వస్తువులకు కరోనా పుణ్యమాని ఒక్క సారిగా డిమాండ్ పెరిగిపోయింది. ఎవ్వరిని చూసినా శానిటైజర్లు, మాస్కులు కొనుగోలు చేయడానికే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఇంతకు ముందు ప్రపంచంలో వ్యాపించిన సార్స్, మెర్స్ లాంటి వైరస్ లను మాస్కులు లేకుండా ఎదురుకొన్నారు.

కానీ తొలిసారిగా కరోనా వ్యాప్తి చెందడంతో ప్రతి ఒక్కరు మాస్కుల వాడకంపై దృష్టిసారిస్తున్నారు. స్వయంగా ప్రభుత్వాలే మాస్కుల వాడకం తప్పనిసరి అంటూ ప్రచారం చేస్తున్నాయి. ఎవరైనా పొరపాటున మాస్కులు ధరించకపోతే వారికి వేలల్లో ఫైన్లు వేస్తామంటూ హెచ్చరిస్తున్నాయి. దీంతో ప్రజలు కూడా మాస్కుల ధరిస్తే తమ ఆరోగ్యమే బాగుంటుందని, ప్రభుత్వానికి ఫైన్ కట్టడం ఎందుకని మాస్కులను కొనుగోలు చేసి వాడుతున్నారు.

మార్కెట్లో మాస్కులు లభించకపోతే స్వయంగా ఇంటి దగ్గరే మాస్కులను తయారు చేసుకుని వాడుతున్నారు. ఈ మాస్కులు వాడడం వలన ఇతరులు మాట్లాడినపుడు, మనం మాట్లాడినపుడు నోటి నుంచి తుంపర్లు ఎదుటివారిపై పడకుండా ఉండడానికి ఇది ఉపయోగ పడుతుంది.

ఇక ఈ మాస్కులను కొన్ని ప్రాంతాల్లో మనుషులు మాత్రమే కాదు, జంతువులు కూడా వాడుతున్నాయి. మొన్నటికి మొన్న ఖమ్మంలో ఓ మేకల యజమాని తన మేకలకు కరోనా రాకుండా మాస్కులు తొడిగాడు. కానీ ఓ కుక్క స్వయంగా దానంతట అదే మాస్కు తొడుక్కుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరస్ అవుతుంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories