సమాచార హక్కు చట్టం ఆర్టీఐ పరిధిలోకి వస్తుందా..?

సమాచార హక్కు చట్టం ఆర్టీఐ పరిధిలోకి వస్తుందా..?
x
Highlights

నేడు సుప్రీం కోర్టు మరో ప్రధాన తీర్పును వెలువరించనుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా సమాచార హక్కు చట్టం ఆర్టీఐ పరిధిలోకి వస్తుదంటూ ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది.

నేడు సుప్రీం కోర్టు మరో ప్రధాన తీర్పును వెలువరించనుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా సమాచార హక్కు చట్టం ఆర్టీఐ పరిధిలోకి వస్తుదంటూ ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంలో పిటిషన్‌లు దాఖలయ్యాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మధ్యాహ్నం 2 గంటలకు తుది తీర్పు వెలువరించనుంది. ఈవిషయాన్ని సుప్రీం కోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.

2010లో ఢిల్లీ హైకోర్టు తీర్పును, కేంద్ర సమాచార కమిషన్ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ కేంద్ర ప్రజా సమాచార విభాగం అధికారి, సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌ పిటిషన్లు వేశారు. వీటిపై ఏప్రిల్‌ 4వ తేదీతో ధర్మాసనం విచారణ ముగిసింది. 'గోప్యతా విధానాన్ని ఎవరూ కోరుకోరని, అయితే, దీనికి పరిమితులు ఉండాలని, పారదర్శకత ముసుగులో న్యాయ వ్యవస్థ నాశనం కాకూడదని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ ధర్మాసనంలో జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ఉన్నారు.

సమాచార హక్కు చట్టం పరిధిలో సీజేఐ కార్యాలయం కూడా ఉంటుందని, న్యాయ వ్యవస్థ స్వతంత్రత అనేది న్యాయమూర్తి హక్కు కాదని, అది న్యాయమూర్తిపై ఉంచిన బాధ్యత అని 2010 లో ఢిల్లీ హైకోర్టు 88 పేజీల తీర్పును వెలువరించింది. అయితే ఆర్టీఐ కింద జడ్జీలకు సంబంధించిన సమాచారాన్ని బహిర్గతం చేయాలనడాన్ని అప్పటి సీజేఐ కేజీ బాలకృష్ణన్‌ వ్యతిరేకించారు. సీజేఐ కార్యాలయాన్ని కూడా ఆర్టీఐ పరిధిలోకి తేవాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసిన ఆర్టీఐ కార్యకర్త ఎస్‌సీ అగర్వాల్‌ తరుపున ఈ కేసును సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ధర్మాసనం ఎదుట వాదించారు. ప్రభుత్వానికి చెందిన ఇతర విభాగాలన్నీ పారదర్శకంగా పనిచేయాలని తరచూ చెప్పే అత్యున్నత న్యాయస్థానం తన వరకు వచ్చే సరికి వెనకడుగు వేస్తోందని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories