డాక్టర్ ఘనకార్యం : కడుపునొప్పి అని వెళ్తే ఇద్దరు యువకులకు ప్రెగ్నెన్సీ పరీక్షలు...

డాక్టర్ ఘనకార్యం : కడుపునొప్పి అని వెళ్తే ఇద్దరు యువకులకు ప్రెగ్నెన్సీ పరీక్షలు...
x
Highlights

కడుపునొప్పిగా ఉందని ఆసుపత్రికి వెళ్ళిన ఇద్దరు యువకులకి ప్రెగ్నెన్సీ పరీక్షలు రాసిచ్చాడు ఓ వైద్యుడు.. ఈ ఘటన జార్ఖండ్‌లోని చాత్ర జిల్లాలోని సిమరాయ్...

కడుపునొప్పిగా ఉందని ఆసుపత్రికి వెళ్ళిన ఇద్దరు యువకులకి ప్రెగ్నెన్సీ పరీక్షలు రాసిచ్చాడు ఓ వైద్యుడు.. ఈ ఘటన జార్ఖండ్‌లోని చాత్ర జిల్లాలోని సిమరాయ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. గత కొద్దిరోజులుగా కడుపునోప్పిగా ఉందని గోపాల్, కామేశ్వర్ అనే ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రిలో చేరారు. వీరిని పరీక్షించిన వైద్యుడు మహేష్ వారికి HIV, HBA, HCA, CBC, HH-2, ANC పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇందులో ANC అనేది మహిళలు గర్భం దాల్చారా లేదా అని తెలుసుకోడానికి ఉపయోగపడే పరీక్ష.. ఇది అక్కడ ఇక్కడ తెలిసి అధికారుల దృష్టికి వెళ్ళింది. దీనిపైన స్పందించిన సదరు వైద్యుడు నేను అలా చేయలేదని కావాలనే నాపై ఇలాంటి చెడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories