కరోనాపై డాక్టర్ల పోరాటం.. సెల్యూట్ చేయకుండా ఉండలేం!

కరోనాపై డాక్టర్ల పోరాటం.. సెల్యూట్ చేయకుండా ఉండలేం!
x
Doctors Sachin Nayak, Sachin Patidar
Highlights

కరోనా వైరస్ రక్కసి నుంచి దేశాన్ని కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే..

కరోనా వైరస్ రక్కసి నుంచి దేశాన్ని కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇక ఆ తర్వాత తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్యులు , పోలీసులు, పారిశుధ్య కార్మికులు పోరాటం చేస్తున్నారు. వారి కృషికి గాను యావత్ దేశం ఇప్పుడు సలాం అంటుంది. విధి నిర్వహణకి వెళ్లి వచ్చిన పోలీసులు తమ కుటుంబానికి దూరంగా ఉంటూ బయటే భోజనం చేస్తున్న పోలీసుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే..

ఇక వైద్యులు కూడా కరోనా భాధితులకి చికిత్స అందిస్తున్నారు. డ్యూటికి అయిపోయాక ఇంటికి వెళ్ళకుండా.. కుటుంబానికి దూరంగా ఉంటూ ఎక్కువగా ఆసుపత్రిలోనే ఉంటున్నారు. తాజాగా కర్ణాటకలో మూడేళ్ళ కుమార్తెకు రెండు వారాలుగా దూరంగా ఉంటున్న నర్సు సంఘటన అందరిని కలిచివేసింది. ఇప్పుడు ఇలాంటి సంఘటనే ఒకటి మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. సచిన్ నాయక్, సచిన్ పాటిదార్ అనే ఇద్దరు డాక్టర్లు మధ్యప్రదేశ్ లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు.

ఆసుపత్రిలో కరోనా వైద్యులకి చికిత్స అందిస్తూ.. ఇంటికి వెళ్ళకుండా కార్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇందుకు కారునే వారు ఓ ఇల్లుగా మార్చుకున్నారు. డ్యూటి అయిపోయాక కారులో కూర్చొని పుస్తకాలు చదవడం, కాసేపు కునుకు తీయడం, ఫోన్లో మాట్లాడటం లాంటి పనులు చేస్తున్నారు. ఇందుకోసం తమ కార్లలోనే బెడ్ షీట్లు, దుస్తులు, ల్యాప్‌టాప్, చాప లాంటివి ఏర్పాటు చేసుకున్నారు. ఇంట్లో వృద్దులు ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. ఇందులో సచిన్ నాయక్ అనే డాక్టర్‌ కి మూడేళ్ల పాప ఉంది. అయితే దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి వచ్చింది. వారు చేస్తున్న పోరాటానికి సెల్యూట్ చేస్తూ ట్వీట్ చేశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories