కడుపు నొప్పి అని వెళితే.. కండోమ్స్‌ తెమ్మన్నాడు

కడుపు నొప్పి అని వెళితే.. కండోమ్స్‌ తెమ్మన్నాడు
x
Highlights

ఓ మహిళ కడుపునొప్పిగా ఉందని సర్కార్ దవాఖానకు వెళితే.. అక్కడ ఉన్న ఓ డాక్టర్ ఆమెకు కండోమ్ తెచ్చుకోమని ప్రిస్క్రిప్షన్ రాసిచ్చాడు. అయితే అందులో ఏం...

ఓ మహిళ కడుపునొప్పిగా ఉందని సర్కార్ దవాఖానకు వెళితే.. అక్కడ ఉన్న ఓ డాక్టర్ ఆమెకు కండోమ్ తెచ్చుకోమని ప్రిస్క్రిప్షన్ రాసిచ్చాడు. అయితే అందులో ఏం రాశిండో తెలియక సక్కగా మెడికల్ షాప్‌కి వెళ్లిన మహిళ డాక్టర్ రాసిఇచ్చిన ప్రిస్కిప్షన్‌ ఇచ్చింది. సదరు మహిళ ప్రిస్కిప్షన్‌ చూసిన సిబ్బంది ఆమెకు కండోమ్స్‌ ప్యాకెట్‌ను అందజేశారు. ఈ ఘటన జార్ఖండ్‌లో జరిగింది. ఇక వివరాల్లోకి వెళితే పశ్చిమ సింగ్భూం జిల్లాకు చెందిన ఓ మహిళా ఉద్యోగికి కడుపునొప్పి వచ్చింది. దీంతో ఆమె ఈనెల 23న స్థానికంగా ఓ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. ఆమెను పరీక్షించిన డాక్టర్ అష్రఫ్ ఆమెకు మందుల చీటీ రాసిచ్చాడు. ఈ మందులు తీసుకువస్తే.. ఎలా వాడాలో చెబుతానని చెప్పాడు ఆ డాక్టర్. దీంతో ఆ మహిళ ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకుని నేరుగా మెడికల్ షాపునకు వెళ్లింది.

అయితే, ఆ చీటీలో ఉన్న మందులతో పాటు ఓ కండోమ్ ప్యాకెట్ కూడా ఇచ్చాడు మెడికల్ షాపులోని వ్యక్తి. దీంతో ఒక్కసారిగా కంగుతిన్నది మహిళ. దీంతో మహిళ వెంటనే వెళ్లి ఆ డాక్టర్‌ను పొట్టుపొట్టు తిట్టింది. అతడిపై పై అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై విచారణకు ఓ కమిటీ వేశారు.తరువాత ఆ మహిళ జార్ఖండ్‌ ముక్తి మోర్చా శాసన సభ్యులు కునాల్‌ సారంగికి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కునాల్ సారంగి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సీనియర్‌ డాక్టర్లు విచారణ ప్రారంభించారు.కాగా ఈ ఘటనపై డాక్టర్‌ అస్రఫ్‌ ఇంతవరకూ స్పందిచకపోవడం గమనార్హం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories