తాగునీటికోసం అల్లాడిపోతోన్న తమిళనాడు

తాగునీటికోసం అల్లాడిపోతోన్న తమిళనాడు
x
Highlights

నీటి ఎద్దడితో తమిళనాడు అల్లాడిపోతోంది. చెన్నైలో బిందెడు నీళ్లు దొరకడం కష్టంగా మారింది. వాటర్ ట్యాంకర్ల వద్ద ప్రజలు యుద్ధాలు చేస్తున్నారు. బస్తీల్లో...

నీటి ఎద్దడితో తమిళనాడు అల్లాడిపోతోంది. చెన్నైలో బిందెడు నీళ్లు దొరకడం కష్టంగా మారింది. వాటర్ ట్యాంకర్ల వద్ద ప్రజలు యుద్ధాలు చేస్తున్నారు. బస్తీల్లో నివసించేవారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ట్యాంకర్ల ద్వారా వచ్చే నీటి కోసం పొద్దంతా పడిగాపులు కాస్తున్నారు. దీంతో తాగునీటి సమస్యపై డీఎంకే ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ నిర్వాహకులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేస్తున్నారు. తాగునీటికోసం అల్లాడిపోతోన్న తమిళనాడునీటి ఎద్దడి తారాస్థాయికి చేరడంతో చెన్నైలో డీఎంకే చీఫ్ స్టాలిన్ ఆందోళన బాట పడ్డారు. తాగునీటి అవసరాలను తీర్చకుండా సర్కారు నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. ఖాళీబిందెలతో మహిళలు ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహించారు. ప్రజలు ఇంత దుర్భర స్థితిని ఎదుర్కొంటున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వెంటనే తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories