నోట్లరద్దు ఎఫెక్ట్..ప్రాణాలు నిలబెడుతుందనుకున్న సొమ్ము పనికిరాకుండాపోయింది!

నోట్లరద్దు ఎఫెక్ట్..ప్రాణాలు నిలబెడుతుందనుకున్న సొమ్ము పనికిరాకుండాపోయింది!
x
అక్కా చెల్లెళ్లు రంగమ్మాళ్‌, తంగమ్మాళ్‌
Highlights

నోట్లరద్దు ముగిసిపోయిన అధ్యాయం కదా..మళ్లీ ఇదేమిటనుకోకండి.. ఆ ఎఫెక్ట్ ఇంకా కొందర్ని వెంటాడుతూనే వుంది.

నోట్లరద్దు ముగిసిపోయిన అధ్యాయం కదా..మళ్లీ ఇదేమిటనుకోకండి.. ఆ ఎఫెక్ట్ ఇంకా కొందర్ని వెంటాడుతూనే వుంది.ప్రస్తుత కాలంలో చూసుకుంటే చాలామంది కొడుకులు తమ తల్లిదండ్రులకు పట్టించుకోవడం లేదు. అది చూసిన ఇద్దరు అక్కాచెల్లెల్లు ఒక నిర్ణయాని కొచ్చారు.

తాము మృతి చెందిన తరువాత తమ కొడుకులకు అంత్యరక్రియల ఖర్చు భారం కావొద్దని ఆలోచించారు. ఆ ఇద్దరు అక్కాచెల్లెల్ల భర్తలు చనిపోయిన తరువాత ఈ ఇద్దరూ ఒకే చోట ఉంటూ కొంత డబ్బును దాచుకున్నారు. కానీ ఇప్పుడ ఆ డబ్బులు చెల్లవని తెలియడంతో వారు ఆందోళనకు గురయ్యారు. ఈ సంఘటన తమిళనాడులోని తిరుప్పూరు జిల్లాలో చోటు చేసుకుంది.

తమిళనాడులోని పూమలూరు గ్రామంలో రంగమ్మాళ్‌ (75), తంగమ్మాళ్‌ (72) అనే అక్కా చెల్లెళ్లు ఇద్దరు జీవిస్తున్నారు. వీరిది చాలా పెద్ద కుటుంబం వీరికి మొత్తం 13 మంది పిల్లలు. వారందరూ మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటూ అందరూ వేర్వేరు చోట్ల స్థిరపడ్డారు. కాగా ఈ ఇద్దరు అక్కా చెల్లెల్ల భర్తలు చనిపోవడంతో వారిద్దరూ పశువులను మేపుతూ పూటగడుపుకుంటూ ఒకరికి ఒకరు సాయపడుతూ బతుకుతున్నారు. వారు సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని వారి ఇంటి గోడలో దాచిపెడుతూ ఉండేవారు.

ఒక రోజున హఠాత్తుగా తంగమ్మాళ్ అనారోగ్యం పాలయింది. దీంతో ఆమెని చూడడానికి వచ్చిన కొడుకుకు తన వైద్యానికి అయ్యే డబ్బు ఇంటి గోడలో దాచిపెట్టానని దాన్ని తీసుకువచ్చి తనకు వైద్యం చేపించాలని తెలిపింది. దీంతో ఆ కొడుకు వెళ్లి గోడలో చూడాగా రూ. 24 వేలు ఉన్నాయి. కానీ ఏం లాభం అవన్నీ కూడా రద్దయిన రూ. 500, రూ. 1000 నోట్లు. ఇప్పుడు ఆ నోట్లు చెల్లవని ఎవరూ వాటిని తీసుకోరని కొడుకు తల్లికి చెప్పడంతో ఒక్కసారిగా విస్తుపోయింది. తాను మాత్రమే కాదని తన అక్క కూడా తనలాగే రూ. 22 వేలు కూడబెట్టిందని చెబుతూ వాపోయింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories