చట్టం ఎవరి చుట్టం కాదు.. వారికి డబుల్ ఫైన్‌లు!

చట్టం ఎవరి చుట్టం కాదు.. వారికి డబుల్ ఫైన్‌లు!
x
Highlights

తాజాగా నూతన మోటారు వాహనాల చట్టం ప్రకారం అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. భారీ ట్రాఫిక్ ఫైన్‌లపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. సోషల్ మీడియాలో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి జ్వాలలు రగిలాయి.

తాజాగా నూతన మోటారు వాహనాల చట్టం ప్రకారం అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. భారీ ట్రాఫిక్ ఫైన్‌లపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. సోషల్ మీడియా, ఇటు ప్రజల్లో తీవ్ర అసంతృప్తి జ్వాలలు రగిలాయి. కొత్త చట్టం అమలు, భారీ జరిమానాలు విధింపుపై నెటిజన్లు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ట్రాఫిక్ విభాగం మరో సంచలన నిర్ణయాన్ని ఓ ప్రకటన చేసింది.

పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే వారికి రెట్టింపు జరిమానా విధించాలని ఢిల్లీ ట్రాఫిక్ విభాగం జాయింట్ పోలీసు కమిషనర్ మీనూ చౌదరి ఆదేశించారు. ఈ మేర ఢిల్లీ ట్రాఫిక్ విభాగం జాయింట్ పోలీసు కమిషనర్ సర్క్యూలర్ జారీ చేశారు. వ్యక్తిగత, ప్రభుత్వ వాహనాలను పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు నడిపేటపుడు జాగ్రత్తగా వ్యవహరించాలని మీనూ చౌదరి ఆదేశించారు. పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు వాహనాలు నడిపేటపుడు సిగ్నల్ జంపింగ్ అయినా, హెల్మెట్ ధరించకున్నా, కారులో సీటు బెల్టు పెట్టుకోకున్నా జరిమానాలు రెండింతలు వేస్తామని ఆమె హెచ్చరించారు. మొత్తానికి చట్టం ఎవరి చుట్టం కాదు అని క్లీయర్ గా చెప్పింది ఢిల్లీ ట్రాఫిక్ విభాగం.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories