ఢిల్లీలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి.. కొత్త కేసులు ఎన్నంటే..

ఢిల్లీలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి.. కొత్త కేసులు ఎన్నంటే..
x
Highlights

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ 4.0 విధించినప్పటికి కరోనా కేసులు మాత్రం ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా ఉద్ధృతి...

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ 4.0 విధించినప్పటికి కరోనా కేసులు మాత్రం ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 571 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 375 మందిని డిశ్చార్జి చేశారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11,659కి పెరిగింది. ఇందులో 5,567 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనాతో 194 మంది ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు.

భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన తర్వాత దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,12,359కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 3435 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 45,300మంది కోలుకోగా మరో 63,624మంది చికిత్స పొందుతున్నారని ప్రకటించింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories