బ్రేకింగ్ : ఈశాన్య ఢిల్లీలో పూర్తిగా అదుపుతప్పిన పరిస్థితులు.. కనబడితే కాల్చివేతకు ఉత్తర్వులు జారీ

బ్రేకింగ్ : ఈశాన్య ఢిల్లీలో పూర్తిగా అదుపుతప్పిన పరిస్థితులు.. కనబడితే కాల్చివేతకు ఉత్తర్వులు జారీ
x
ఈశాన్య ఢిల్లీలో పూర్తిగా అదుపుతప్పిన పరిస్థితులు
Highlights

పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక, అనూకల వర్గాల ఆందోళనలతో ఈశాన్య ఢిల్లీలో పరిస్థితులు పూర్తిగా అదుపుతప్పాయి. పలు చోట్ల హింసాత్మక ఘటనలు తీవ్రరూపం దాల్చాయి....

పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక, అనూకల వర్గాల ఆందోళనలతో ఈశాన్య ఢిల్లీలో పరిస్థితులు పూర్తిగా అదుపుతప్పాయి. పలు చోట్ల హింసాత్మక ఘటనలు తీవ్రరూపం దాల్చాయి. ఇప్పటి వరకు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అల్లరి మూకలు సృష్టించిన విధ్వంసంలో పలు వాహనాలు, షాపులు ధ్వంసం అయ్యాయి. కేంద్ర బలగాలు ఈశాన్య ఢిల్లీని చుట్టుముట్టారు. బాష్పవాయు గోలాలు ప్రయోగించారు. కనబడితే కాల్చివేతకు ఉత్తర్వులు జారీ చేశారు.

ఢిల్లీ-గజియాబాద్ రహదారి మూసివేశారు. ఈశాన్య ఢిల్లీ ప్రజలు ఇళ్లలోనే ఉండాలని పోలీసులు ఆదేశించారు. 13 పారామిలటరీ బృందాలు రంగంలోకి దిగారు. పది సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఆందోళనలు అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో హోంశాఖ కీలక చర్యలు చేపట్టారు. స్పెషల్ పోలీస్ కమిషనర్ గా ఎస్ఎన్.శ్రీవాత్సను నియమించారు. ఈశాన్య ఢిల్లీలో కర్ప్యూ విధించారు. అల్లర్లు చలరేగుతున్న ప్రాంతాల్లో స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. పరిస్థితిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సునిషితంగా పరిశీలిస్తున్నారు. మరో వైపు జప్రాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర సీఏఏ వ్యతిరేక నిరసన ర్యాలీ ప్రాంతాన్ని నిరనస కారులు ఖాళీ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories