ఢిల్లీలో అత్యంత ప్రమాదకర కాలుష్యం.. హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలపై సీఎం కేజ్రీవాల్ ఆగ్రహం

ఢిల్లీలో అత్యంత ప్రమాదకర కాలుష్యం.. హర్యానా, పంజాబ్  ప్రభుత్వాలపై సీఎం కేజ్రీవాల్ ఆగ్రహం
x
Highlights

దేశ రాజధాని ఢిల్లీ పూర్తిగా కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ప్రమాదకర స్థాయికి ఢిల్లీలో కాలుష్యం చేరింది. దాంతో జనం అల్లాడిపోతున్నారు. హర్యానా, పంజాబ్...

దేశ రాజధాని ఢిల్లీ పూర్తిగా కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ప్రమాదకర స్థాయికి ఢిల్లీలో కాలుష్యం చేరింది. దాంతో జనం అల్లాడిపోతున్నారు. హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట వ్యర్థాలు కాల్చకుండా అడ్డుకోవాలని ఎప్పటివరకు చర్యలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారానికి కేంద్రం చొరవ చూపించాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లాట్ విజ్ఞప్తి చేశారు.

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం స్థాయి అత్యంత ప్రమాదకర స్థితిలోకి పడిపోయింది. గత గురువారం రాత్రి నుంచి నమోదైన కాలుష్యం స్థాయిలు మరింత దిగజారి తొలిసారిగా వెయ్యి పాయింట్లు దాటాయి. దీంతో ఢిల్లీలో వాతావరణం విషపూరితంగా మారింది. ఆదివారం ఢిల్లీలో కాలుష్యానికి తోడుగా చినుకులు పడటంతో ఆకాశమంతా మబ్బులతో కప్పి ఉంది. కొన్ని చోట్ల చీకట్లు అలుముకున్నాయి. ఎదురుగా ఉన్న వారు కూడా కనిపించకపోవడంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడ్డారు. ఇళ్ల నుంచి బయటకు వస్తే బ్రీతింగ్ మాస్క్ లను తప్పకుండా ధరిస్తున్నారు. ఇటు వాహనదారుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఎదురుగా వస్తున్న వెహికిల్ దగ్గరగా వచ్చే వరకు కనిపించకపోవడంతో కష్టాలు తప్పడం లేదు.

ఢిల్లీ పొగమంచులో తీవ్రస్థాయిలో హానికర వాయువులు చేరాయని కాలుష్య నియంత్రణ బోర్డు ప్రకటించింది. వాయుకాలుష్యం కారణంగా ఢిల్లీకి రావాల్సిన పలు విమానాలను దారి మళ్లించారు. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. అలాగే చిన్నారుల ఆరోగ్యం దృష్ట్యా స్కూళ్లకు సెలవును వచ్చే మంగళవారం వరకు పొడగించారు. అలాగే పరిశ్రమలు మూసేయ్యాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఢిల్లీలో కాలుష్యం స్థాయి పెరగడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట వ్యర్థాలు కాల్చకుండా అడ్డుకోవాలని ఎప్పటివరకు చర్యలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇవాళ్టి నుంచి వాహనాలకు సరి బేసి విధానాన్ని అమలు చేస్తామన్నారు. అలాగే ట్రక్కుల ప్రవేశంపై కూడా నిషేధం విధిస్తామన్నారు. ఢిల్లీ ప్రభుత్వం మాత్రమే వాయు కాలుష్యాన్ని తగ్గించలేదని, అందుకు కేంద్రం కూడా సహకరిస్తేనే అది సాధ్యమని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అభిప్రాయపడ్డారు. ఇది హెల్త్ ఎమర్జెన్సీ అని, కేవలం రాష్ట్ర ప్రభుత్వమే నియంత్రించలేదని, కేంద్రం కూడా చొరవ చూపించాలని గెహ్లాట్ విజ్ఞప్తి చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories