logo

17 రోజుల్లో ఇద్దరు మాజీ సీఎంలను కోల్పోయిన ఢిల్లీ

17 రోజుల్లో ఇద్దరు మాజీ సీఎంలను కోల్పోయిన ఢిల్లీ
Highlights

ఇద్దరూ సంచలన నేతలే. ఇద్దరూ తమ పరిపాలనలో మార్క్ చూపించారు. ఇద్దరూ ఢిల్లీకి సీఎంలుగా చేసినవాళ్లే. ఇద్దరి మధ్యా...

ఇద్దరూ సంచలన నేతలే. ఇద్దరూ తమ పరిపాలనలో మార్క్ చూపించారు. ఇద్దరూ ఢిల్లీకి సీఎంలుగా చేసినవాళ్లే. ఇద్దరి మధ్యా వయసు తేడా ఉన్నా 17 రోజుల తేడాలో ఇద్దరూ కన్నుమూయడం విషాదకరం. వేరు వేరు పార్టీలతకు చెందినా పాలిటిక్స్‌లో తమదైన పంథాలో కొనసాగి సక్సెస్‌లేడిస్‌గా పేరు తెచ్చుకున్నారు.

సుష్మాస్వరాజ్ బీజేపీ ఫైర్‌బ్రాండ్, షిలాదీక్షిత్‌ కాంగ్రెస్‌ సినీయర్‌ నేత. రాజకీయంగా ప్రత్యర్థులైనా పాలనలో తమదైన స్టైల్‌లో దూసుకుపోయారు. వేరువేరు జెండాలు పట్టుకున్నా వారి అజెండా మాత్రం ఒక్కటే. ప్రజల శ్రేయస్సు కోసమే మరణించే వరకు పాలన సాగించారు. ఈ ఇద్దరు నేతలు 17 రోజుల తేడాతో కన్నుమూయడం పలువురిని కలిచివేస్తోంది. జులై 20న గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌. సరిగ్గా 17 రోజులకు మరో మహిళా నేత సుష్మాస్వరాజ్‌ కూడా గుండెపోటుతోనే కన్నుమూయడం విషాదకరం.

వయసులో పెద్దవారైన షీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. ఆమె కంటే ముందు ఆ పదవిని నిర్వహించారు సుష్మాస్వరాజ్‌. ఐతే ఆమె ఢిల్లీ సీఎంగా కంటే జాతీయ నాయకురాలిగా ప్రపంచ గుర్తింపు పొందారు. ఢిల్లీ ఐదో సీఎంగా సుష్మాస్వరాజ్‌ సేవలందించారు. ఆరో ముఖ్యమంత్రిగా షీలాదీక్షిత్‌ పనిచేశారు. సుష్మాస్వరాజ్ షీలాదీక్షిత్‌ కంటే 14 ఏళ్లు చిన్న.

1998లో ఢిల్లీ ఎన్నికలకు 40 రోజుల ముందు ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన సుష్మస్వరాజ్ అప్పట్లో విపరీతంగా ఉల్లిపాయల రేటు పెరగడంతో ఇబ్బంది పడ్డారు. ధర తగ్గించేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకపోయింది. కేజీ రూ.50 వరకు ధర పలకడంతో సుష్మస్వరాజ్ ప్రభుత్వం పతనమైంది.

షీలాదీక్షిత్‌ మాత్రం ఢిల్లీకి అత్యంత ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ఏకంగా 15 సంవత్సరాల పాటు హస్తిన ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2014 మార్చి 11 నుంచి అదే సంవత్సరం ఆగస్ట్ 25 వరకు కేరళ గవర్నర్‌గానూ కొనసాగారు. ఇలా ఇద్దరు నేతలూ ప్రజాసేవకే అంకితమై కొద్ది రోజుల తేడాతో ఈ లోకాన్ని వీడిపోవడం విషాదకరం.


లైవ్ టీవి


Share it
Top