Delhi Election Result 2020: ఆప్‌ అభ్యర్ధులు హవా

Delhi Election Result 2020: ఆప్‌ అభ్యర్ధులు హవా
x
Highlights

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా బ్యాలెట్ ఓట్ల లెక్కింపును చేపట్టి, ఆ తర్వాత ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపును...

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా బ్యాలెట్ ఓట్ల లెక్కింపును చేపట్టి, ఆ తర్వాత ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. మొత్తం 70 స్థానాలకి గాను కౌంటింగ్ జరుగుతుంది. దీనికి గాను 21 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదలైన కౌంటింగ్ లో ఆప్‌ అభ్యర్ధులు దూసుకుపోతున్నారు... మెజారిటీ స్థానాల్లో ఆప్‌ అభ్యర్ధులు హవా కనిపిస్తోంది. ఇప్పటికే మ్యాజిక్ మార్క్ ని దాటేసింది ఆ పార్టీ . మద్యాహ్నం వరకు అధికారం ఎవరిదో క్లారిటీ రానుంది.

ఇక హస్తినలో మరోసారి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే వెల్లడించాయి. గతంలో వరుసగా మూడుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఈ సారి ఖాతా తెరవడం అనుమానమేనని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పిన సంగతి విదితమే

Show Full Article
Print Article
More On
Next Story
More Stories