ప్రైవేటు హాస్పిట‌ళ్ల‌కు వార్నింగ్ ఇచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌!

ప్రైవేటు హాస్పిట‌ళ్ల‌కు వార్నింగ్ ఇచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌!
x
Arvind Kejriwal(File photo)
Highlights

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రైవేటు హాస్పిట‌ళ్ల‌కు వార్నింగ్ ఇచ్చారు. ప్రైవేటు హాస్పిట‌ళ్లు క‌రోనా పేషెంట్ల‌ను వెన‌క్కి పంపించ‌రాదని వార్నింగ్ ఇచ్చారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రైవేటు హాస్పిట‌ళ్ల‌కు వార్నింగ్ ఇచ్చారు. ప్రైవేటు హాస్పిట‌ళ్లు క‌రోనా పేషెంట్ల‌ను వెన‌క్కి పంపించ‌రాదని వార్నింగ్ ఇచ్చారు.కరోనా రోగుల కోసం ప్రైవేటు హాస్పిట‌ళ్లు 20 శాతం బెడ్‌ల‌ను రిజ‌ర్వ్ చేయాల‌ని ఆదేశించారు. మొత్తం 117 హాస్పిట‌ళ్లు ఈ ఏర్పాటు చేసుకోవాల‌న్నారు. కోవిడ్ చికిత్స కోసం నేటి నుంచి రెండు వేల బెడ్స్ అందుబాటులో ఉంటాయ‌న్నారు.

తాజాగా ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి ఓ క‌రోనా పేషెంట్‌కు చికిత్స అందించేందుకు నిరాక‌రించింది. దీనితో ప్ర‌భుత్వం సదరు ఆసుపత్రికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇక ప్ర‌భుత్వం ఆధీనంలో 4వేల బెడ్‌లు ఉన్నాయ‌ని, ప్ర‌స్తుతానికి 1500 బెడ్స్ మాత్ర‌మే నిండి ఉన్న‌ట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు.

ఇక ఢిల్లీలో కూడా కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 635 కేసులు నమోదు అయ్యాయి.రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 14,053కు చేరింది. కరోనా బారినపడిన వారిలో 7006 మంది చికిత్స పొందుతుండగా, 6771 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 276 మంది కరోనా వైరస్‌ ప్రభావంతో మరణించారు. గత 24 గంటల్లో 231 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

ఇక అటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ 4.0 నడుస్తున్నప్పటికి కరోనా కేసులు ఎక్కడ కూడా తగ్గుముఖం పట్టడం లేదు.. దేశవ్యాప్తంగా మొత్తం 1,38,845 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 4021 మంది మరణించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories