18కి చేరిన మృతుల సంఖ్య.. 269 మంది పోలీసులకు గాయాలు

18కి చేరిన మృతుల సంఖ్య.. 269 మంది పోలీసులకు గాయాలు
x
Highlights

ఈ నెల 9 వ తేదీన పౌరసత్వ చట్ట బిల్లును అమలులోకి తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

ఈ నెల 9 వ తేదీన పౌరసత్వ చట్ట బిల్లును అమలులోకి తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా ప్రజలు నిరసనలు, ఆందోళణలను చేపట్టారు. ఇదే నేపథ్యంలో నాలుగు రోజుల తరువాత అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో మరోసారి ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి. విద్యార్థుల చేస్తున్న ఈ నిరసనలకు అధ్యాపకులు, నాన్-టీచింగ్ స్టాఫ్ సైతం మద్దతుతెలిపారు.

ఇదిలా ఉంటే ఇప్పటి వరకూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని చేపట్టిన నిరసనలలో శుక్రవారం ఒక్క రోజే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా ఇప్పటి వరకూ వేరు వేరు చోట్ల జరిగిన ఘటనల్లో ఈ సంఖ్య18కి చేరింది. చనిపోయిన వారిలో పెద్ద వారు, ముసలి వారు మాత్రమే కాకుండా ఎనిమిదేళ్ల బాలుడు కూడా ఉండడం ఆ ప్రాంతాన్ని విషాదంలో ముంచింది. ఇక కాన్పూర్‌ విషయానికొస్తే పోలీస్ ఔట్‌పోస్ట్‌ను సైతం ఆందోళన కారులు నిప్పంటించారు. ఇక రామ్‌పూర్‌లో ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ అల్లర్లలో 57 మందికి బుల్లెట్లు తగిలాయని, 269 మంది పోలీసులు గాయపడ్డారని యూపీ ఐజీ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

ఇప్పటివరకూ జరిగిన ఆందోళణలో భాగంగా మొత్తం 5,400 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఆందోళనకారుల నుంచి ఆయుధాలను, 405 నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు స్పష్టం చేసారు. 705 మందిని మాత్రమే జైలుకు పంపించామని తెలిపారు. వీరిలో 60 మందిపై ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్టు తెలియజేశారు. ఆందోళనకారులతో పాటు ప్రముఖ సామాజిక కార్యకర్తలైన దీపక్ కబీర్ అలియాస్ దీపక్ మిశ్రా, ఎస్ఆర్ దర్మపురి లాంటి వారిని కూడా అరెస్ట్ చేశామని తెలిపారు.

అంతే కాకుండా వాట్సాప్‌లో వదంతులు వ్యాపింపజేస్తున్న 13,000 మందిని గుర్తించామని తెలిపారు. ఇలాంటి విషయాలు వ్యాపింప చేయకుండా కొన్ని ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసారు. మొత్తం 21 జిల్లాల్లో సోమవారం వరకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండవని ప్రకటించారు. అంతే కాకుండా పాఠశాలలు, కాలేజీలను కూడా ప్రభుత్వం మూసివేశారు. యూపీలో పెరిగిపోతున్న హింసను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కఠిన చర్యలకు ఉపక్రమించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories