విడాకులు తీసుకున్న స్వాతి మలివాల్‌

విడాకులు తీసుకున్న స్వాతి మలివాల్‌
x
Highlights

ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ (డిసిడబ్ల్యు) చీఫ్ స్వాతి మాలివాల్ తన భర్త ఆమ్‌ ఆద్మీ పార్టీ హర్యానా కన్వీనర్‌ నవీన్‌ జైహింద్ తో నిన్న (బుధవారం) విడాకులు పొందారు.

ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ (డిసిడబ్ల్యు) చీఫ్ స్వాతి మాలివాల్ తన భర్త ఆమ్‌ ఆద్మీ పార్టీ హర్యానా కన్వీనర్‌ నవీన్‌ జైహింద్ తో నిన్న (బుధవారం) విడాకులు పొందారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె ఎమోషనల్ పోస్ట్ చేశారు. " మంచి మనసులు కలిగిన వారు కూడా ఒక్కోసారి కలిసి ఉండలేరు. మన జీవితంలో రంగుల కలలు ముగిసిపోవడం కంటే బాధాకరమైన విషయం ఇంకోటి ఉండదు. నాది కూడా అలాంటి పరిస్థితినే... నేను, నవీన్ వేరుపడ్డాం. ఈ బాధను ఎదుర్కోవటానికి మాకు తట్టుకునే శక్తిని దేవుడు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను" అని పోస్ట్ చేశారు.

ఇక స్వాతి మలివాల్‌ దేశంలోనే అత్యంత పిన్న వయసులో మహిళా కమిషన్‌ బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. స్వాతి మాలివాల్ ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో జన్మించారు. ఢిల్లీలోని జేఎస్‌ఎస్‌ కాలేజీలో ఐటీలో డిగ్రీ చేశారు. ఆ తర్వాత ఆమె అన్నా హజారే నేతృత్వంలో సాగిన అవినీతి వ్యతిరేక పోరాటంలో ఆమె పాల్గొన్నారు. ఆ సమయంలో ఆమెకి నవీన్‌ జైహింద్‌ తో పరిచయం, ప్రేమ ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఆమె నవీన్ ని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిపోయారు. పార్టీ హర్యానా విభాగానికి నవీన్ కన్వీనర్ కాగా, ఢిల్లీలో ఎమ్మెల్యే టికెట్ మిస్ కావడంతో స్వాతికి మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి దక్కింది.

చిన్నారులపై అత్యాచారాలు చేసేవాళ్లకు కఠినంగా శిక్షలు విధించేలా పోక్సో చట్టం రావడంలో స్వాతి కృషి ఎంతో ఉంది. ఇక 'మీటూ' ఉద్యమ సమయంలో స్వాతి భర్త నవీన్ మహిళలను కించపరుస్తూ చేసిన కామెంట్లు దంపతుల ఇద్దరి మధ్య చిచ్చుపెట్టింది. అప్పటి నుంచి ఇద్దరు విడివిడిగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు అది కాస్త విడాకులకు దారి తీసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories