కూతురి పెళ్లికి 2200 పుస్తకాలు గిఫ్టుగా ఇచ్చిన తండ్రి

కూతురి పెళ్లికి 2200 పుస్తకాలు గిఫ్టుగా ఇచ్చిన తండ్రి
x
Highlights

సహజంగా అయితే ఓ కూతురు పెళ్లి చేస్తే ఆ తండ్రి తన కూతురికి ఇష్టమైన బట్టలను, నగలను లేదా ఇల్లును ప్రేమగా ఇస్తాడు. కానీ ఓ తండ్రి మాత్రం పుస్తకాల్ని...

సహజంగా అయితే ఓ కూతురు పెళ్లి చేస్తే ఆ తండ్రి తన కూతురికి ఇష్టమైన బట్టలను, నగలను లేదా ఇల్లును ప్రేమగా ఇస్తాడు. కానీ ఓ తండ్రి మాత్రం పుస్తకాల్ని కూతురికి ఇచ్చాడు. ఈ ఘటన గుజరాత్ లోని రాజ్‌కోట్‌లో చోటు చేసుకుంది. తన కూతురు ఎంత బరువు ఉందో అంత బరువు కలిగిన పుస్తకాల్ని ఆమెకి ఇచ్చాడు. దీనితో ఆమె 2200 పుస్తకాలతో అత్తావారింటిలోకి అడుగుపెట్టింది. దీనితో అక్కడ ఈ వార్త ప్రాధాన్యతను సంతరించుకుంది.


ఇక వివరాల్లోకి వెళ్తే హర్దేవ్ సింగ్ జడేజా అనే వ్యక్తి వృత్తిరీత్యా టీచర్ తన కూతురు కిన్నారిబా కి పుస్తకాలు అంటే పిచ్చి.. ఆమె ఇష్టాన్ని గౌరవించి చిన్నప్పటి నుంచీ ఆమెకు పుస్తకాలు కొనిస్తూ ఉండేవాడు. తన కూతురి కోసం ఇంట్లో 500 పుస్తకాలతో ఓ లైబ్రరీని కూడా ఏర్పాటు చేశాడు. ఇక తన కూతురుకి వడోదరకు చెందిన ఇంజినీర్ పూర్వాజిత్ సింగ్‌తో పెళ్లి ఫిక్స్ చేయడంతో కిన్నారిబా తనకు ఖరీదైన గిఫ్టుల కంటే పుస్తకాలనే పెళ్లి గిఫ్టుగా ఇవ్వమని తన తండ్రిని కోరింది.


కూతురు కోరిక మేరకు తన కూతురికి ఇష్టమైన పుస్తకాల లిస్టుని రాసుకొని దేశంలోని కొన్ని నగరాలలో ఆరు నెలలు తిరిగి పుస్తకాలను సేకరించి పట్టుకొచ్చాడు. ఇందులో మాములు పుస్తకాలతో పాటు మహారుషి వేద వ్యాసుడు, 18 పురాణాలు, ఖురాన్, బైబిల్ సహా పవిత్ర గ్రంథాలు కూడా ఉన్నాయి. తన కోరికని మెచ్చి ఇన్ని పుస్తకాలను అందించినందుకు గాను ఆమె ఎంతో ఆనందించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories