పుల్వామా ఉగ్రదాడిపై స్పందించిన డొనాల్డ్‌ ట్రంప్‌

పుల్వామా ఉగ్రదాడిపై స్పందించిన డొనాల్డ్‌ ట్రంప్‌
x
Highlights

పుల్వామా ఉగ్రదాడిపై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. ఈ దాడిని ఆయన ఖండించారు. భారత్‌కు చెందిన 42 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు...

పుల్వామా ఉగ్రదాడిపై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. ఈ దాడిని ఆయన ఖండించారు. భారత్‌కు చెందిన 42 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు దాడిలో చనిపోవడం తాను కళ్లారా చూశానని ట్రంప్‌ అన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు తమ పాలనావ్యవస్థ మొత్తం భారత్‌కు సహకరిస్తుందని ట్రంప్‌ స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రదాడితో భారత్‌-పాక్‌ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో భారత్‌ చాలా బలంగా ఉందని, ఉగ్రవాదాన్ని పోత్సహించడం పాకిస్తాన్‌కు సరైన పద్ధతి కాదని ట్రంప్ పేర్కొన్నారు. పరిస్థితిని సద్దుమనిగించేందుకు ఇరుదేశాలతో చర్చిస్తున్నట్లు ట్రంప్‌ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories