ప్రమాదంలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం

ప్రమాదంలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం
x
Highlights

కర్నాటకలో ప్రమాదంలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం ప్రమాదపు అంచులో ఉంది. ఎమ్మెల్యేల సంఖ్య మ్యాజిక్ మార్కునకు అటూ ఇటూ ఊగిసలాడుతోంది. కాంగ్రెస్-జేడీఎస్ కు...

కర్నాటకలో ప్రమాదంలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం ప్రమాదపు అంచులో ఉంది. ఎమ్మెల్యేల సంఖ్య మ్యాజిక్ మార్కునకు అటూ ఇటూ ఊగిసలాడుతోంది. కాంగ్రెస్-జేడీఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నట్టు కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. ఆపరేషన్ కమల ఇంకా కొనసాగుతూనే ఉందని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ సర్కార్‌ను అస్థిర పరచేందుకు, రాష్ట్రపతి పాలన తెచ్చేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్, కేంద్ర సంస్థలన్నీ మూకుమ్మడిగా పని చేస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.. తమ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి భారీ మొత్తంలో డబ్బును ఆఫర్ చేశారని తెలిపారు.

అయితే ముఖ్యమంత్రి కుమారస్వామి మాత్రం తమ పార్టీ నుంచి ఒక్కరిని తీసికెళ్తే అక్కడ్నించి పది మంది వస్తారు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు కుమారస్వామితో టచ్ లో ఉన్నారా? అన్న సందేహం రాకమానదు. మరోవైపు కాంగ్రెస్-జేడీఎస్ ల ఆరోపణలను బీజేపీ నేతలు ఖండించారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలను తాము ఎలాంటి ప్రలోభాలకు గురిచేయలేదని చెప్పారు. ఆధారాలు ఉంటే కుమారస్వామి బయటపెట్టాలని సవాల్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories