అమెరికా అమ్మాయిల దీపావళి స్టెప్పులు అదుర్స్

అమెరికా అమ్మాయిల దీపావళి స్టెప్పులు అదుర్స్
x
Highlights

భారతీయులు ఎంతో సాంప్రదాయ బద్దంగా జరుపుకునే దీపావళి పండగను ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు.

దీపావళి పండుగ వచ్చిందంటే ఆనందాలు వేల్లివిరిసినట్టే. ఒక్క భారత సాంప్రదాయ వాదులే కాదు ప్రపంచ వ్యాప్తంగా దీపావళి పండుగకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీపావళి అంటే సర్వజన ఆనంద కేళిగా మారిపోయింది ఇప్పుడు.

దీపావళి పండుగను మన దేశంతో పాటూ ఇతర దేశాల్లోనూ ఘనంగా జరుపుకుంటున్నారు. ఎక్కడికక్కడ ఉన్న భారతీయులు తాము ఉంటున్న ప్రాంతాలలో దీపాల పండగ చేసుకుంటుంటే, దీని ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఇప్పుడు దీపావళి పండుగ అంటే దాదాపు అన్ని దేశాల వారూ మన వారితో కలసి నిర్వహించుకుంటున్నారు.

ఈ కోవలోనే ఈ దీపావళి సందర్భంగా న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో ప్రత్యేక ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలకు సంబంధించిన వీడియోను యూఎస్ ఎంబసీ ఇండియా, తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. సూపర్ హిట్ బాలీవుడ్ చిత్రం 'సత్యమేవ జయతే' చిత్రంలోని 'దిల్ బర్' సాంగ్ కు కొందరు యూఎస్ అమ్మాయిలు సంప్రదాయ దుస్తులతో నృత్యం చేశారు. పాటకు అనుగుణంగా వారు నర్తిస్తుంటే, చుట్టూ ఉన్నవారు ఈలలు వేసి గోల చేస్తూ ఉత్సాహ పరిచారు. ఈ వీడియోను చూసిన వారంతా అమెరికన్ల డ్యాన్స్ సూపరంటున్నారు.

అమెరికా అతివలు మన దీపావళికి తమ నృత్యాలతో సందడి చేస్తున్న ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది.






Show Full Article
Print Article
More On
Next Story
More Stories