మహారాష్ట్రలో తుపాను ఎఫెక్ట్.. బీచ్ ల మూసివేత!

మహారాష్ట్రలో తుపాను ఎఫెక్ట్.. బీచ్ ల మూసివేత!
x
Highlights

అరేబియా సముద్రంలో వాయు తుపాన్‌ బలపడిందన్న హెచ్చరికలతో మహారాష్ట్ర అప్రమత్తమైంది. కొంకణ్‌ ప్రాంతంలోని పాలఘర్‌, థానే, ముంబై, రాయ్‌గఢ్‌, రత్నగిరి,...

అరేబియా సముద్రంలో వాయు తుపాన్‌ బలపడిందన్న హెచ్చరికలతో మహారాష్ట్ర అప్రమత్తమైంది. కొంకణ్‌ ప్రాంతంలోని పాలఘర్‌, థానే, ముంబై, రాయ్‌గఢ్‌, రత్నగిరి, సింధుదుర్గ్‌లోని అన్ని బీచ్‌లను మూసివేయాలని, ఆయా బీచ్‌ల్లోకి రానున్న రెండు రోజుల్లో ప్రజలను అనుమతించరాదని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

వాయు తుపాన్‌ ప్రభావంతో గురువారం ఉదయం నుంచే సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడతాయని, తుపాన్‌ ప్రభావంతో మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వాయు తుపాన్‌ గురువారం గుజరాత్‌ తీరంలో పోర్‌బందర్‌, దియూల మధ్య తీరం దాటుతుందని, ఈ సమయంలో గంటకు 145 నుంచి 155 కిమీ వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories