తీరం దాటిన బుల్‌ బుల్ తుఫాన్

Bulbul cyclone
x
Bulbul cyclone
Highlights

బంగాళఖాతంలో ఏర్పడిన బెంగాల్-బంగ్లాదేశ్ మధ్య 'బుల్‌బుల్' తుఫాన్ తీరం దాటింది. ఒడిషా, పశ్చిమబెంగాల్, పారాదీప్, బంగ్లాదేశ్ తీరాల్లో గంటలకు 120-140...

బంగాళఖాతంలో ఏర్పడిన బెంగాల్-బంగ్లాదేశ్ మధ్య 'బుల్‌బుల్' తుఫాన్ తీరం దాటింది. ఒడిషా, పశ్చిమబెంగాల్, పారాదీప్, బంగ్లాదేశ్ తీరాల్లో గంటలకు 120-140 కిలోమీటర్ల వేగంతో గాలులు బలంగా వీస్తున్నాయి. బుల్ బుల్' తుపాను కారణంగా పశ్చిమ బెంగాల్ హడలిపోతోంది. ఇప్పటికే ఒడిశాలో తీవ్ర వర్షాలకు కారణమైన 'బుల్ బుల్' పశ్చిమ బెంగాల్ పైనా ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి సర్కారు అప్రమత్తమైంది. తుపానుపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలని సీఎం మమతా బెనర్జీ అధికారులను ఆదేశించారు.

సీఎం ఆదేశాలతో తుపాను ప్రభావం చూపుతుందని అంచనా వేసిన ప్రాంతాల్లో 1.2 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యల కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories