Top
logo

పెను తుపాన్‌గా మారుతున్న 'బుల్‌బుల్‌'

పెను తుపాన్‌గా మారుతున్న
Highlights

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర రూపం దాల్చింది. రాబోయే 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని, నవంబరు 9...

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర రూపం దాల్చింది. రాబోయే 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని, నవంబరు 9 నాటికి అది తీవ్ర తుఫానుగా మారే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీకి తుఫాన్ ముంపు పొంచి వుంది.

ప్రస్తుతం అండమాన్ దీవులకు పశ్చిమ వాయవ్య దిశగా 390 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. శుక్రవారం సాయంత్రం నుంచి ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నవంబరు 9 నాటికి అది తీవ్ర తుఫానుగా మారే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బుల్ బుల్ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయి. తెలంగాణలోనూ అక్కడక్కడా మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Next Story


లైవ్ టీవి