ఓ క్రెడిట్ కార్డు భర్త అక్రమ సంబంధాన్ని బయటపెట్టింది ..

ఓ క్రెడిట్ కార్డు భర్త అక్రమ సంబంధాన్ని బయటపెట్టింది ..
x
Highlights

పెళ్లి అయి మూడు రోజులు మాత్రమే అయింది . అంతలోనే భర్త అక్రమ సంబంధం బయటపడింది . ఇది ఒక క్రెడిట్ కార్డు ద్వారా అంటే నమ్మగలరా అవును .. ఈ సంఘటన గుజరాత్...

పెళ్లి అయి మూడు రోజులు మాత్రమే అయింది . అంతలోనే భర్త అక్రమ సంబంధం బయటపడింది . ఇది ఒక క్రెడిట్ కార్డు ద్వారా అంటే నమ్మగలరా అవును .. ఈ సంఘటన గుజరాత్ లోని గాంధీనగర్ లో చోటు చేసుకుంది . వివాహం అయిన మూడవరోజు అ భర్త ఆఫీస్ పని చెప్పి తన పాత గర్ల్ ఫ్రెండ్ తో రెస్టారెంట్ కి వెళ్ళాడు . కానీ అ క్రెడిట్ కార్డు బిల్లు అతని అక్రమ సంబంధాన్ని బయటపెట్టింది .

తరచుగా తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్తూ తన భార్యకు అబద్దం చెప్పడంతో అనుమానం వచ్చిన అతని భార్య అతని క్రెడిట్ కార్డు బిల్ చెక్ చేయగా అసలు విషయం బయటపడింది . తన భర్త చివరగా ఓ రెస్టారెంట్ లో బిల్లు పే చేసినట్టు గుర్తించి తన సోదరుడితో కలిసి రెస్టారెంట్ కి వెళ్లి విచారణ జరపగా తన భర్త మరో యువతీతో రెస్టారెంట్ కి వచ్చినట్లు తేలింది . దీనితో భర్త అసలు రంగు బయటపడింది .

ఈ విషయంపైన భర్తను నిలదీయగా ఎం చేసుకుంటావో చేసుకోపో అని సమాధానం ఇవ్వడంతో అ యువతి పోలీసులను ఆశ్రయించింది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories