దేశంలో 24 గంటల్లో 7 వేల పాజిటివ్‌ కేసులు

దేశంలో 24 గంటల్లో 7 వేల పాజిటివ్‌ కేసులు
x
Highlights

ప్రపంచాన్ని వనికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు భారత్ లో కూడా విలయతాండవం చూపిస్తోంది.

ప్రపంచాన్ని వనికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు భారత్ లో కూడా విలయతాండవం చూపిస్తోంది. దేశంలో గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 6977 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 154 మంది మృతి చెందారు. ఇప్పటివరకు ఒక్కరోజులో గరిష్ఠ పెరుగుదల ఇదే కావడం విశేషం.. దీనితో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్‌ పదో స్థానానికి చేరింది. ఇప్పటివరకు ఇరాన్‌ ఆ స్థానంలో ఉంది.

తాజా కేసులతో కలిపి దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,38,845 కి చేరుకుంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 77103గా ఉంది. ఇక కరోనా చికిత్స పూర్తి చేసుకుని కోలుకున్న వారి సంఖ్య 57720గా ఉంది. ఇక దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ నుంచి కోలుకుని 4021 మంది మృతి చెందారు. దేశంలోని మొత్తం కేసుల్లో 84% మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌, దిల్లీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ల్లోనే ఉన్నాయి.

ఇందులో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 50231 కేసులు నమోదు కాగా, 1635 మంది మరణించారు. మహారాష్ట్ర తరవాత తమిళనాడు రెండో స్థానంలో ఉంది..అక్కడ ఇప్పటివరకు 111 మంది మరణించారు. ఇక ఆ తర్వాత గుజరాత్‌లో ఇప్పటివరకు 14,056 కరోనా కేసులు నమోదు కాగా, 858 మంది మృతిచెందారు. ఇక ఢిల్లీలో 13,418 కేసులు, రాజస్థాన్‌ లో 7,028 కేసులు, మధ్యప్రదేశ్‌ లో 6,665, ఉత్తరప్రదేశ్‌ లో 6268 కేసులు నమోదు అయ్యాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories