Coronavirus: కరోనా బాధితులకు పంజాబ్‌ ప్రభుత్వం భారీ షాక్

Coronavirus: కరోనా బాధితులకు పంజాబ్‌ ప్రభుత్వం భారీ షాక్
x
Highlights

కోవిడ్19 మహమ్మారి కారణంగా ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనవుతుంటే. కరోనా వైరస్‌ బాధితులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం వారిని షాక్ కు గురిచేసే ప్రకటన...

కోవిడ్19 మహమ్మారి కారణంగా ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనవుతుంటే. కరోనా వైరస్‌ బాధితులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం వారిని షాక్ కు గురిచేసే ప్రకటన చేసింది పంజాబ్‌ ప్రభుత్వం. కరోనా లక్షణాలతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరిన వారి చికిత్స కు ఖర్చును ప్రభుత్వం భరించదని స్పష్టం చేసింది. ఎవరి ఖర్చులు వారే భరించుకోవాలని అమరీందర్‌ సింగ్‌ సర్కారు పేర్కొంది. ఈ మేరకు బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలో దశలవారీగా మద్యం అమ్మకాలు జరిపేందుకు అనుమతినివ్వాలని కేంద్రాన్ని కోరిన పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ . కరోనా సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రానికి 3 వేల కోట్ల రూపాయలు విడుదల చేసేలా చొరవ తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు లేఖ రాసింది పంజాబ్‌ ప్రభుత్వం. మంగళవారం నాటికి పంజాబ్ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 256కు చేరింది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories