Top
logo

వినూత్న రీతిలో వివాహం

వినూత్న రీతిలో వివాహం
Highlights

పెళ్ళంటే చాలు ముందుగా అందరికీ గుర్తోచ్చేది బాజాభజంత్రీలు, మూడు ముళ్ళు, ఏడు అడుగులు, బంధువులు, హడావిడి. కాని ఇవేమీ లేకుండా ఒక ప్రేమజంట వినూత్న రీతిలో పెళ్లి చేసుకున్నారు.

పెళ్ళంటే చాలు ముందుగా అందరికీ గుర్తోచ్చేది బాజాభజంత్రీలు, మూడు ముళ్ళు, ఏడు అడుగులు, బంధువులు, హడావిడి. కాని ఇవేమీ లేకుండా ఒక ప్రేమజంట వినూత్న రీతిలో పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ నూరేళ్ళ వైవాహిక జీవితానికి సాక్ష్యంగా వారు రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఒక్కటయ్యారు. ఈ వినూత్న వివాహం గురించి ఇప్పుడు తెలుకుందాం.

ఒడిశాలోని బెర్హంపూర్ నగరంలో ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న విప్లవ్ కుమార్, నర్సుగా పనిచేస్తున్న అనిత కొంత కాలంగా ప్రేమించుకున్నారు. ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్ళికి సిద్ధమయ్యారు. అందరూ చేసుకున్నట్టుగా హంగూ ఆర్భాటాలతో కాకుండా వారి పెళ్లి సింపుల్ గా చేసుకోవాలనుకున్నారు. అంతేకాదు వారి వైవాహిక జీవితాన్ని ఒక మంచి పని చేసి మొదలు పెట్టుకోవాలనుకున్నారు. అందుకు తగ్గట్టుగా వధూ వరులతో పాటు పెళ్లికి వచ్చిన అతిథులు రక్తదానం చేసే ఏర్పాటు చేసారు. అంతేనా వారి పెళ్ళికి సాక్ష్యంగా భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఒక్కటయ్యారు.Next Story