భారత్‌లో మూడో కరోనా కేసు

భారత్‌లో మూడో కరోనా కేసు
x
భారత్‌లో మూడో కరోనా కేసు
Highlights

భారత్‌లో కరోనా వైరస్‌ మూడో కేసు నమోదైంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇటు భారతదేశ ప్రజల్ని కూడా భయాందోళనలకు గురి చేస్తోంది. ఇప్పటికే కేరళలో...

భారత్‌లో కరోనా వైరస్‌ మూడో కేసు నమోదైంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇటు భారతదేశ ప్రజల్ని కూడా భయాందోళనలకు గురి చేస్తోంది. ఇప్పటికే కేరళలో కరోనా వైరస్ బారిన పడి ఇద్దరు చికిత్స పొందుతున్నారు. తాజాగా ఈ సంఖ్య మూడుకు చేరింది. కేరళలో మరో కేసు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ అధికారికంగా ధృవీకరించారు. కేరళ కాసర్‌గోడ్ జిల్లాలో ఈ కేసు నమోదైంది. ప్రస్తుతం బాధితుడిని ప్రత్యేకంగా ఓ వార్డులో పెట్టి చికిత్స అందిస్తున్నారు.

కాగా, కరోనా వైరస్‌ మృతుల సంఖ్య 305కు చేరింది. చైనాలో 304 మంది చనిపోగా.. చైనా బయట తొలి కరోనా మృతి ఫిలిప్పీన్స్‌లో నమోదైంది. ఆ దేశ రాజధాని మనీలాలో నివసిస్తున్న ఓ చైనీయుడు వైరస్‌ బారిన పడి మరణించాడు. ఇక చైనాలో ఈ వైర్‌సతో బాధపడుతున్న వారి సంఖ్య 14వేల 380కి చేరుకుందని ఆ దేశ హెల్త్‌ కమిషన్‌ వెల్లడించింది. కాగా.. ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల్లో 100 మందికి పైగా కరోనా వైరస్‌ బారిన పడ్డారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories