కర్ణాటకపై కరోనా ఎఫెక్ట్‌.. విద్యాసంస్థలు, థియేటర్లు, నైట్‌ క్లబ్‌లు మూసివేత

కర్ణాటకపై కరోనా ఎఫెక్ట్‌.. విద్యాసంస్థలు, థియేటర్లు, నైట్‌ క్లబ్‌లు మూసివేత
x
yeddyurappa
Highlights

కరోనా వైరస్‌తో కర్ణాటకకు చెందిన 76 ఏళ్ల వృద్ధుడు మృతిచెందడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రాష్ట్రంలో కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు...

కరోనా వైరస్‌తో కర్ణాటకకు చెందిన 76 ఏళ్ల వృద్ధుడు మృతిచెందడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రాష్ట్రంలో కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు ప్రారంభించింది. ఈ సందర్భంగా సీఎం యెడియూరప్ప అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

రాష్ట్రంలో రేపటి నుంచి వారం రోజుల పాటు మాల్స్‌, విద్యాసంస్థలు, థియేటర్లు, నైట్‌ క్లబ్‌లు, పబ్‌లు, స్విమ్మింగ్‌ఫూల్స్‌ను మూసివేయనున్నట్లు సీఎం ప్రకటించారు. అలాగే వివాహాలు, క్రీడా పోటీలు, సదస్సులు వాయిదా వేసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 5 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు వెల్లడించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories