దేశంలో 1000కి దగ్గరలో కరోనా పాజిటివ్ కేసులు.. 25 మంది మృతి

దేశంలో 1000కి దగ్గరలో కరోనా పాజిటివ్ కేసులు.. 25 మంది మృతి
x
Highlights

కరోనా వైరస్ దేశంలో చాపకింద నీరులా పారుకుపోతుంది.

కరోనా వైరస్ దేశంలో చాపకింద నీరులా పారుకుపోతుంది. దీనిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లుగా ప్రకటించినప్పటికీ రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. నిన్న సాయింత్రం వరకు 870కి పైగా కేసులు నమోదుకాగా, ఈ ఉదయానికి పాజిటివ్ గా తేలిన వారి సంఖ్య 979కి చేరింది. వీరిలో 48 మంది విదేశాలకు చెందిన వారు ఉన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య‌శాఖ అధికారికంగా వెల్ల‌డించింది. మొత్తం ఈ వైరస్ బారిన పడి 25 మంది మృతి చెందారు..

ఇక ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో 193 కేసులు నమోదు అయ్యాయి.. ఆ తర్వాత కేరళలలో 182 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. కర్ణాటకలో 81, తెలంగాణలో 67, ఉత్తర ప్రదేశ్ లో 65, గుజరాత్లో 55, రాజస్థాన్ లో 54, ఢిల్లీలో 49, తమిళనాడులో 42, మధ్యప్రదేశ్ లో 39, పంజాబ్ లో 38, హర్యానాలో 35, జమ్ము కశ్మీర్ లో 33 కేసులు నమోదయ్యాయి. ఒక్క వారంలోనే దేశంలో 800 కొత్త కేసులు నమోదు అయ్యాయి.. ఇక ప్రస్తుతం దేశంలో కరోనా స్టేజీ 3 కి రాకుండా కేంద్ర కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అయిదు లక్షల మందికి కరోనా సోకినట్లుగా తెలుస్తోంది. ఇక 25, 000 మంది మరణించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories