కరోనా కల్లోలంలో రష్యా ఉక్కిరిబిక్కిరి

కరోనా కల్లోలంలో రష్యా ఉక్కిరిబిక్కిరి
x
Highlights

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి రష్యాలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. చాలా దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ రష్యాలో మాత్రం...

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి రష్యాలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. చాలా దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ రష్యాలో మాత్రం రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. చైనాలో కరోనా వైరస్ మొదలైన తొలినాళ్లలో సరిహద్దులను మూసేసిన రష్యా తర్వాత ధీమా ప్రదర్శించింది. తమ దేశంలో వైరస్ లేదన్న అలసత్వానికి ప్రస్తుతం మూల్యం చెల్లించుకుంటోంది.

రష్యాలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. చాలా దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ రష్యాలో మాత్రం రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రష్యాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 3లక్షలు దాటింది. దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 3 లక్షల 8 వేల 705 కి చేరింది. ఇప్పటి వరకు ఆ దేశంలో కరోనా నుంచి 76,130 మంది కోలుకున్నారు. రష్యాలో రికార్డు స్థాయిలో 73లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు రష్యా చిగురుటాకులా వణుకుతోంది. తొలిసారి చైనాలో కరోనా విజృంభించగా తర్వాత ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, అమెరికాలను అతలాకుతలం చేసింది. అక్కడ వైరస్‌ విస్తృతంగా వ్యాపించినప్పుడు రష్యాలో మాత్రం అతి తక్కువగా కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ ప్రభుత్వం అలసత్వం వహించింది. దీనికి ప్రస్తుతం మూల్యం చెల్లించుకుంటోంది. ఇప్పటి వరకూ రష్యాలో పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువయ్యింది. అమెరికా తర్వాత అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదయిన దేశాల జాబితాలో రెండో స్థానానికి చేరింది. అయితే, మరణాల రేటు మాత్రం తక్కువగా ఉంది. మొత్తం 2,837 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రభుత్వ నిర్లక్ష్యమే కొంప ముంచిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ దేశాల్లో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో రష్యా కొంతమేరకు సురక్షితంగానే కనిపించింది. జనవరి 30నే చైనాతో సరిహద్దులను మూసేసి, దేశంలోకి వచ్చే ప్రతి ప్రయాణికుణ్ని పరీక్షించాలని పుతిన్ ఆదేశించారు. అయితే క్షేత్రస్థాయిలో అటు అధికారులు, ఇటు ప్రజలు సమస్య తీవ్రతను పట్టించుకోలేదు.

వైరస్ ఎక్కువగా ఉన్న ఇటలీ, ఫ్రాన్స్‌ లాంటి దేశాల నుంచి వచ్చే వారినీ సరిగ్గా పరీక్షించకుండానే వదిలేశారు. లాక్‌డౌన్‌ విధించినా ప్రజలు వీధుల్లోనే గుమిగూడటంతో ప్రస్తుతం అక్కడ రోజుకు సగటున 10 వేల కేసులు నమోదవుతున్నాయి. మొత్తం నమోదైన కేసుల్లో సగం దేశ రాజధానిలోనే ఉంటున్నాయి. మొదట్లో మాస్కోలోనే కేంద్రీకృతమైన వైరస్‌ ప్రస్తుతం దేశమంతటా వ్యాపిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories